BAN vs NZ: న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ సంచలన విజయం!
Bangladesh beat New Zealand: బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను 150 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. శనివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో 332 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను 181 పరుగులకే కుప్పకూల్చింది.
నాలుగో రోజు ఆటలో బంగ్లాదేశ్ స్పిన్నర్లు చెలరేగారు. తైజుల్ ఇస్లామ్(6/75) ఆరు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. నయీమ్ హసన్(2/40) రెండు వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్, మెహ్‌దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(58) మినహా అంతా దారుణంగా విఫలమయ్యారు. చివర్లో టీమ్ సౌథీ(34) ఒంటరి పోరాటం చేశాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులకు ఆలౌటైంది. మహ్ముదుల్ హసన్ జాయ్(86) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటై 7 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(205 బంతుల్లో 11 ఫోర్లతో 104) సెంచరీ సాధించగా.. డారిల్ మిచెల్(41), గ్లేన్ ఫిలిప్స్(42) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 338 పరుగులు చేసింది. నజ్ముల్ హోస్సెన్ షాంటో(105) సెంచరీ చేయగా.. ముఫికర్ రహీమ్(67), మెహ్‌దీ హసన్ మీరాజ్(50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. దాంతో న్యూజిలాండ్ ముందు 332 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.

పిచ్ పూర్తిగా పగుళ్లు రావడంతో స్పిన్‌కు అనుకూలంగా మారింది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై న్యూజిలాండ్ బ్యాటర్లు తేలిపోయారు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టి ఘోర పరాజయం చవి చూశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్‌ను ఓడించడం బంగ్లాదేకు రెండోసారి మాత్రమే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications