BAN vs NZ: బంగ్లాదేశ్ పర్యటనను న్యూజిలాండ్ విజయంతో ముగించింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం ముగిసిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో గ్లేన్ ఫిలిప్స్(48 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 40 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో కివీస్‌ను గెలిపించాడు. దాంతో రెండు టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమమైంది.
137 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 39.4 ఓవర్లలో 6 వికెట్లకు 139 పరుగులు చేసింది. టామ్ లాథమ్(26), డేవాన్ కాన్వే(2), కేన్ విలియమ్సన్(11), హెన్రీ నికోల్స్(3), డారిల్ మిచెల్(19), టామ్ బ్లండెల్ విఫలమైనా.. మిచెల్ సాంట్నర్(35 నాటౌట్)తో కలిసి గ్లేన్ ఫిలిప్స్ అటాకింగ్ గేమ్ ఆడాడు.

69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన న్యూజిలాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఏడో వికెట్‌కు సాంట్నర్‌తో కలిసి అజేయంగా 70 పరుగులు జోడించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీ హసన్ మీరాజ్(3/52) మూడు వికెట్లు తీయగా.. తైజుల్ ఇస్లామ్(2/58) రెండు వికెట్లు పడగొట్టాడు. షోరిఫుల్ ఇస్లామ్‌కు ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు 38/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను 144 పరుగులకు ముగించింది. జాకీర్ హసన్(86 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 59) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆజాజ్ పటేల్(6/57) ఆరు వికెట్లతో సత్తా చాటాడు. మిచెల్ సాంట్నర్‌కు మూడు వికెట్లు దక్కగా.. టీమ్ సౌథీకి ఓ వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు కుప్పకూలింది. వర్షం కారణంగా రెండో రోజు ఆట తుడిచిపెట్టుకుపోయింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్ గ్లేన్ ఫిలిప్స్(72 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 87) విధ్వంసకర బ్యాటింగ్‌తో 180 పరుగులు చేసింది. దాంతో కివీస్‌కు 8 పరుగుల ఆధిక్యం దక్కింది.
మెహ్‌దీ హసన్ మీరాజ్(3/53), తైజుల్ ఇస్లామ్(3/64) మూడేసి వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్(2/15), నయీమ్ హసన్(2/21) రెండేసి వికెట్లు పడగొట్టారు.