For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

BAN vs NZ: గ్లేన్ ఫిలిప్స్ సంచలనం.. ఆలౌట్ ముంగిట బంగ్లాదేశ్!

BAN vs NZ: న్యూజిలాండ్ పార్ట్ టైమ్ స్పిన్నర్ గ్లేన్ ఫిలిప్స్(4/53) సంచలన ప్రదర్శన చేశాడు. ఫుల్‌టైమ్ బౌలర్‌గా చెలరేగాడు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ పట్టుబిగించింది. గ్లేన్ ఫిలిప్స్‌తో పాటు కైల్ జెమీసన్(2/52), అజాజ్ పటేల్(2/76) రెండేసి వికెట్లతో సత్తా చాటడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 9 వికెట్లకు 310 పరుగులు చేసింది.

మహ్ముదుల్ హసన్ జాయ్(166 బంతుల్లో 11 ఫోర్లతో 86) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఇష్ సోదీకి ఓ వికెట్ దక్కింది.

BAN vs NZ: Glenn Phillips Stars With 4-Wicket Haul, Bangladesh 310/9 At Stumps

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జకీర్ హసన్(12)ను అజాజ్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం నిలకడగా ఆడే ప్రయత్నం చేస్తున్న నజ్ముల్ హోస్సెన్ షాంటో(37)ను గ్లేన్ ఫిలిప్స్ పెవిలియన్ చేర్చాడు.

క్రీజులోకి వచ్చిన మోమినల్ హక్(37)‌తో కలిసి మహ్ముదుల్ హసన్ జట్టును ఆదుకున్నాడు. మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించాడు. మోమినుల్ హక్‌ను ఫిలిప్స్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. సెంచరీ దిశగా సాగుతున్న మహ్ముదుల్ హసన్(86)ను ఇష్ సోదీ ఔట్ చేశాడు. ఈ వికెట్‌తో బంగ్లాదేశ్ పతనం మొదలైంది.

ముష్ఫికర్ రహీమ్(12)ను అజాజ్ పటేల్ ఔట్ చేయగా.. మెహ్‌దీ హసన్ మీరాజ్‌(20)ను కైల్ జెమీస్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. కాసేపు నికలడగా ఆడిన నురుల్ హసన్(29)‌ను ఫలిప్స్ ఔట్ చేయగా.. నయిమ్ హసన్(16)ను కైల్ జెమీసన్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. చివర్లో తైజుల్ ఇస్లామ్(8 బ్యాటింగ్), షోరిఫుల్ ఇస్లామ్(13 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు.

వికెట్ కీపర్ అయిన గ్లేన్ ఫిలిప్స్.. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా సత్తా చాటడం చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. వన్డే ప్రపంచకప్‌లోనే తన బౌలింగ్ నైపుణ్యం చూపించిన ఫిలిప్స్.. టెస్ట్‌ల్లోనూ కొనసాగిస్తున్నాడు.

Story first published: Tuesday, November 28, 2023, 17:35 [IST]
Other articles published on Nov 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+