Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే క్రికెట్‌‌లో సంచలనం.. బంగ్లాదేశ్ చేతిలో న్యూజిలాండ్ ఘోర పరాజయం!

BAN vs NZ: వన్డే క్రికెట్‌లో సంచలన ఫలితం నమోదైంది. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ఘోర పరాజయం చవిచూసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం తెల్లవారుజామున జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌పై ఆతిథ్య బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-1 తేడాతో గెలిచినా.. చివరి మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది.

బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి 98 పరుగులకే కుప్పకూలి అప్రతిష్టను మూటగట్టుకుంది. బంగ్లాదేశ్ బౌలర్లు షోరిఫుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సౌమ్య సర్కార్ మూడేసి వికెట్లతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 31.4 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్(43 బంతుల్లో 3 ఫోర్లతో 26), కెప్టెన్ టామ్ లాథమ్(34 బంతుల్లో సిక్స్‌తో 21) టాప్ స్కోరర్లుగా నిలిచాడు. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

BAN vs NZ: Bangladesh beat New Zealand by 9 wickets in 3rd ODI

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 15.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. 209 బంతులు మిగిలి ఉండగానే గెలుపొంది భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ సౌమ్య సర్కార్(4) రిటైర్ట్ హర్ట్ అవ్వగా.. అనముల్ హక్(33 బంతుల్లో 7 ఫోర్లతో 37), నజ్ముల్ హెస్సెన్(42 బంతుల్లో 8 ఫోర్లతో 51 నాటౌట్) రాణించారు. కివీస్ బౌలర్లలో విలియమ్ ఓ రూర్కీకి ఓ వికెట్ దక్కింది.

బంగ్లాదేశ్ చేతిలో న్యూజిలాండ్ చిత్తుగా ఓడటంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను ఓడించం ఏ జట్టు వల్ల కాదని, కివీస్‌కు కూడా ఓటమి రుచి చూపించారని కొనియాడుతున్నారు. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.

Story first published: Saturday, December 23, 2023, 9:50 [IST]
Other articles published on Dec 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+