For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Dan Christian: 6 బంతుల్లో 5 సిక్స్‌లు.. ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ ఉగ్రరూపం! (వీడియో)

BAN vs AUS: RCBs Dan Christian smashes five sixes in an over of Shakib Al Hasan.

ఢాకా: తన వల్లే సిరీస్ ఓడిపోయామనే బాధో లేక ధాటిగా ఆడాలనే కసో తెలియదు కానీ ఆస్ట్రేలియా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ డానియల్ క్రిస్ట్రియన్ ఉగ్రరూపం దాల్చాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్, బెస్ట్ టీ20 బౌలర్ అయిన షకీబ్ అల్ హసన్‌ను చీల్చి చెండాడాడు. 6 బంతుల్లో 5 సిక్సర్లు బాది బంగ్లాదేశ్ ఆటగాళ్లను వణికించాడు. షకీబ్ అదృష్టం కొద్ది ఆ ఒక్క బంతి మిస్సయింది గానీ లేకుంటే ఈ ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ చరిత్రకెక్కేవాడు. 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన యువరాజ్ సింగ్, హెర్షెల్ గిబ్స్, కీరన్ పొలార్డ్, సోబెర్స్ సరసన నిలిచేవాడు. కానీ షకీబ్ రాత బాగుండి అది సాధ్యం కాలేదు. కానీ ఆస్ట్రేలియా మాత్రం అద్భుత విజయాన్నందుకుంది.

అసలేం జరిగిందంటే..

ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఇప్పటికే బంగ్లాదేశ్ 3-1తో కైవసం చేసుకుంది. గత శుక్రవారం జరిగిన నిర్ణయాక మ్యాచ్‌లో ఆసీస్ సునాయసంగా గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. చివరి రెండు ఓవర్లలో ఆసీస్ విజయానికి 23 రన్స్ కావాలి. క్రీజులో డానియల్ క్రిస్టియన్ కూడా ఉన్నాడు. దాంతో ఆసీస్ విజయం ఖాయమని భావించారు. కానీ బంతిని అందుకున్న ముస్తాఫిజర్ అద్భుతం చేశాడు. తనదైన యార్కర్లతో 6 బంతుల్లో ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. ఫిజ్ కట్టుదిట్టమైన బంతులకు ఆసీస్ బ్యాట్స్‌మన్ డానియల్ క్రిస్టియన్ తెల్లమొహం వేసాడు. తొలి రెండు బంతుల్లో అలెక్స్ క్యారీ ఒక పరుగు తీయగా.. మిగతా నాలుగు బంతుల్లో క్రిస్టియన్ దారుణంగా తడబడ్డాడు. దాంతో ఆసీస్ విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు చేయాల్సి వచ్చింది. మెహ్‌ది హసన్ వేసిన ఆ ఓవర్‌లో క్యారీ సిక్స్ కొట్టినా ఫలితం లేకపోయింది. దాంతో బంగ్లాదేశ్‌ తొలిసారి ఆస్ట్రేలియాపై సిరీస్ విజయాన్నందుకుంది. ఈ క్రమంలోనే డానియల్ క్రిస్టియన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

కసికసి.. కసిగా...

కసికసి.. కసిగా...

ఇక శనివారం జరిగిన నామమాత్రపు నాలుగో టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన డానియల్ క్రిస్టియన్.. గత మ్యాచ్ పరాభావానికి బదులు తీర్చుకున్నాడు. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై నాలుగో ఓవర్‌లోనే బౌలింగ్‌కు వచ్చిన షకీబ్ అల్ హసన్‌కు చుక్కలు చూపించాడు. తొలి బంతిని స్టెప్ ఔటై లాంగాన్ దిశగా సిక్సర్ బాదిన క్రిస్టియన్.. రెండో బంతిని వైడ్ లాంగ్ ఆన్ దిశగా పంపించాడు. ఇక మూడో బంతిని స్లాగ్ స్వీప్ షాట్‌తో డీప్ మిడ్ వికెట్‌ మీదుగా మైదానం బయట పడేసి హ్యాట్రిక్ సిక్సర్ సాధించాడు. అతని ధాటికి షకీబ్ అల్ హసన్ తెల్ల మొహం వేసాడు.

నాలుగో బంతి డాట్..

నాలుగో బంతి డాట్..

షకీబ్ తెలివిగా నాలుగో బంతిని ఔట్‌సైడ్ ఆఫ్‌‌ స్టాంప్ దిశగా వేయగా.. స్లాగ్ స్వీప్ ఆడబోయిన క్రిస్టియన్ విఫలమయ్యాడు. దాంతో ఆ బంతి డాట్ అయింది. దాంతో షకీబ్ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఆ మరుసటి బంతిని లాంగాన్ దిశగా భారీ సిక్సర్‌గా మలిచిన క్రిస్ట్రియన్.. చివరి బంతిని ఓవర్ డీప్ మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్ తరలించాడు. దాంతో ఆ ఓవర్‌లో 30 పరుగులు వచ్చాయి. అయితే ఆ జోరు క్రిస్టియన్ కొనసాగించలేకపోయాడు. గత మ్యాచ్‌లో తనను ఇబ్బంది పెట్టిన ముస్తాఫిజుర్ బౌలింగ్‌లోనే క్రిస్టియన్(15 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లతో 39) వెనుదిరిగాడు. ఫిజ్ వేసిన ఫుల్లర్ బంతిని షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

ఆస్ట్రేలియాకు ఓదార్పు విజయం..

ఆస్ట్రేలియాకు ఓదార్పు విజయం..

ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షో కనబర్చిన ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది ఓదార్పు విజయాన్నందుకుంది. వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 104 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ నైమ్(28), హోస్సెన్(23), మెహ్‌దీ హసన్(23) టాస్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆండ్రూటై, మిచెల్ స్వెప్సన్ చెరో మూడు వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్ 2, అష్టన్ అగర్ ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. క్రిస్టియన్ విధ్వంసతో 19 ఓవర్లలో 7 వికెట్లకు 105 పరుగులు చేసి 6 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది.

ఆనందంలో ఆర్‌సీబీ ఫ్యాన్స్

ఆనందంలో ఆర్‌సీబీ ఫ్యాన్స్

ఇక డాన్ క్రిస్టియన్ విధ్వంసకర బ్యాటింగ్ పట్ల ఆర్‌సీబీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2021 సెకండాఫ్ ప్రారంభానికి ముందు క్రిస్టియన్ ఫామ్‌లోకి రావడం తమ జట్టుకు కలిసొస్తుందని కామెంట్ చేస్తున్నారు. 2011 నుంచి డాన్ క్రిస్టియన్ ఐపీఎల్ ఆడుతున్నాడు. కానీ ఇప్పటి వరకు అతను మార్క్ పెర్ఫామెన్స్ కనబర్చలేకపోయాడు. ఈ ఏడాదే ఆర్‌సీబీ జట్టులోకి వచ్చిన అతను 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పెద్దగా రాణించకపోయినప్పటికీ మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి ఫ్రాంచైజీ మందలింపునకు గురయ్యాడు. కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఫస్టాఫ్ ముగిసే సరికి ఆర్‌సీబీ టాప్-3లో నిలిచింది.

Story first published: Monday, August 9, 2021, 14:57 [IST]
Other articles published on Aug 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+