Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా టీ20 టీమ్‌లో భారత ఆటగాడు!

బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. అయితే ఈ జట్టులో భారత్‌కు చెందిన నిఖిల్ చౌదరికి అవకాశం దక్కడం హాట్‌టాపిక్‌గా మారింది. వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌కు ట్రావిస్ హెడ్ దూరం కావడంతో అతని స్థానంలో 30 ఏళ్ల నిఖిల్ చౌదరికి అవకాశం లభించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలోనే ఉన్న ఆసీస్.. మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. జూన్ 15 నుంచి మొదలయ్యే మూడు టీ20ల సిరీస్‌లోనూ ఆడనుంది.

BAN vs AUS: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై విజయం!

BAN vs AUS: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై విజయం!

ఎవరీ నిఖిల్ చౌదరి..

నిఖిల్ చౌదరి 1996లో భారత్‌లోని ఢిల్లీ జన్మించాడు. భారత దేశవాళీ క్రికెట్ కూడా ఆడాడు. పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. హర్భజన్ సింగ్ మార్గదర్శకంలో రాటుదేలాడు.

Australia Name Indian-Born Spinner Nikhil Chaudhary in T20I Squad for Bangladesh Tour

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే పదేళ్ల క్రితం అతని కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడింది. ఆస్ట్రేలియాకు వెళ్లినా నిఖిల్ క్రికెట్‌ను వదల్లేదు. అక్కడి లోకల్ టోర్నీల్లో ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత బిగ్ బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు.

బిగ్ బాష్ ప్రదర్శనతో..

బిగ్ బాష్ లీగ్‌లో 32 మ్యాచ్‌లు ఆడి 693 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 9 వికెట్లు తీసాడు. ఈ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. బంగ్లాదేశ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో నిఖిల్ చౌదరిని క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్లు టీ20 జట్టులోకి తీసుకున్నారు. అయితే 1964 తర్వాత భారత్‌లో జన్మించి ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికైన తొలి క్రికెటర్‌గా నిఖిల్ చౌదరి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఆస్ట్రేలియా టీ20 జట్టు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, నిఖిల్ చౌదరి, కూపర్ కానోలి, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమన్, రైలీ మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, ఆడమ్ జంపా.

BAN vs AUS: ఏందిరా ఈ ఎచ్చిడి!

BAN vs AUS: ఏందిరా ఈ ఎచ్చిడి!
Story first published: Thursday, June 11, 2026, 15:43 [IST]
Other articles published on Jun 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+