BAN vs AUS: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై విజయం!
వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌లో విజయాన్ని కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఢాకా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతి ద్వారా 86 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మొసాడెక్ హుస్సేన్ అద్భుతమైన ప్రదర్శనతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో అజేయ హాఫ్ సెంచరీతో రాణించిన మొసాడెక్(86 నాటౌట్), బౌలింగ్‌లో (2/37) రెండు వికెట్లు పడగొట్టాడు.
బంగ్లాదేశ్ 284/8
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 284 పరుగులు చేసింది. తంజిద్ హసన్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54), నజ్ముల్ హొస్సేన్ షాంటో(86 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 67), మోసాడెక్ హోస్సేన్(70 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. లియామ్ స్కాట్, మ్యాట్ రేన్‌షా రెండేసి వికెట్లు తీసారు. గ్జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ పడగొట్టాడు.

వర్షం అంతరాయం..
అనంతరం ఆస్ట్రేలియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 42.2 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులే చేసింది. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు. అలెక్స్ క్యారీ(62 బంతుల్లో 5 ఫోర్లతో 47), కామెరూన్ గ్రీన్ (66 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్), కూపర్ కనోల్లీ(50 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) మినహా అంతా విఫలమయ్యారు.
బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా(4/41) నాలుగు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మొసాడెక్ హుస్సేన్(2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు. టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీసాడు.
21 ఏళ్ల తర్వాత విజయం..
ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకపోవడం ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూన్ 11న ఢాకా వేదికగానే జరగనుంది.
సొంతగడ్డపై వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం బంగ్లాదేశ్‌కు ఇదే తొలిసారి. 2005లో కార్టిఫ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ తొలిసారిగా ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. సుమారు 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై రెండో విజయాన్ని కైవసం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

