తిలక్ వర్మపై జాతి వివక్ష వ్యాఖ్యలు.. అర్ష్‌దీప్ సింగ్‌పై నిషేధం విధించాలి: మాజీ క్రికెటర్
జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై నిషేధం విధించాలని టీమిండియా మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ డిమాండ్ చేశాడు. ఈ సీజన్ మొత్తం ఆడకుండా చేయాలని బీసీసీఐని కోరాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ షేర్ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది.
కర్రోడా అని సంభోదించడంతో..
ఈ వీడియోలో తిలక్ వర్మను అర్ష్‌దీప్ సింగ్ కర్రోడా అని సంభోదించాడు. 'అరే ఓ కర్రోడా.. సన్‌స్క్రీన్ రాశావా?’అని అడిగాడు. అంతటితో ఆగకుండగా.. నమన్ ధీర్‌ను అందగాడని అభివర్ణించాడు. ఈ వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపింది. కొందరు ఈ వీడియోను సరదాగా తీసుకొన్న మరికొందరు మాత్రం జాతి వివక్ష వ్యాఖ్యలుగా పేర్కొంటూ అర్ష్‌దీప్ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా స్పందించిన శివరామకృష్ణన్.. అర్ష్‌దీప్ సింగ్‌పై నిషేధం విధించాలని బీసీసీఐని డిమాండ్ చేశాడు. ఇలాంటి ఘటనలను డ్రెస్సింగ్ రూమ్ జోక్స్‌గా కొట్టిపారేస్తే ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతాయని అభిప్రాయపడ్డాడు.

తిలక్ స్పందించడు..
'తిలక్ వర్మ కెరీర్ ఆరంభంలో ఉంది. కాబట్టి ఈ జాతి వివక్ష వ్యాఖ్యలపై స్పందించడు. కానీ బీసీసీఐ.. ఈ వీడియో ప్రూఫ్‌తో అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకోవచ్చు. ఇది ఏ మాత్రం ఆట కాదు.. ఇదో వృత్తి. జాతి వివక్ష గురించి చెబితే నన్ను ఎవరూ నమ్మలేదు. ప్రతీ ఒక్కరు నన్ను తిట్టడంతో పాటు ట్రోల్ చేశారు.
అర్ష్‌దీప్ సింగ్‌ను ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించాలి. నేను మరోసారి ట్రోలింగ్ గురువుతానని తెలుసు. బీసీసీఐ చర్యలు తీసుకుంటుందంటే.. నా పట్ల జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి వారి పేర్లు చెబుతాను. వారిపై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందా? ’అని శివమరామకృష్ణ వరుస ట్వీట్స్ చేశాడు.
ఇరకాటంలో బీసీసీఐ..
ఈ ఘటన బీసీసీఐని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఫ్రాంచైజీలకు ఆఫ్ ఫీల్డ్‌లో ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించి ఏడు గైడ్‌లైన్స్‌ను బీసీసీఐ జారి చేసింది. ఈ క్రమంలో అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకుంటారా? లేక చూసి చూనట్లు వదిలేస్తారా? అనేది తీవ్ర చర్చనీయాంశమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications