Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ball Of IPL 2024: ఇషాంత్ శర్మ బుల్లెట్ యార్కర్.. కుప్పకూలిన రస్సెల్! (వీడియో)

ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ కళ్లు చెదిరే యార్కర్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో వైజాగ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ బుల్లెట్ యార్కర్‌‌తో ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రస్సెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఇషాంత్ శర్మ కళ్లు చెదిరే యార్కర్ ఆడలేక రస్సెల్ క్రీజులో కుప్పకూలాడు. ఈ స్టన్నింగ్ డెలివరీకి ఫిదా అయిన రస్సెల్.. ఇషాంత్ శర్మను అభినందిస్తూ క్రీజును వీడాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Ball Of IPL 2024 Andre Russell applauds Ishant Sharma after being cleaned up by bullet yorker

కేకేఆర్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని ఇషాంత్ శర్మ యార్కర్‌‌గా సంధించగా.. కాళ్లలోకి దూసుకొచ్చిన ఈ బంతిని ఆడటంలో తడబడ్డ రస్సెల్.. క్రీజులో కుప్పకూలాడు. బంతి నేరుగా మిడిల్ స్టంప్‌ను తాకింది. ఈ బంతికి ఫిదా అయిన నెటిజన్లు బాల్ ఆఫ్ ఐపీఎల్ అంటూ కొనియాడుతున్నారు.

రస్సెల్‌కు యార్కర్ బాల్స్ ఆడటం బలహీనత. తన లోయర్ బాడీ చాలా బలహీనంగా ఉంటుందని, చాలా ఇంటర్వ్యూల్లో రస్సెల్ తెలిపాడు. అందుకే ప్రత్యర్థి బౌలర్లు అతని కాళ్లను టార్గెట్ చేస్తూ యార్కర్లు సంధించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో ఆ బంతులు కాస్త అతనికి లో ఫుల్‌టాస్ వస్తాయి. వాటిని నిర్దాక్షిణ్యంగా రస్సెల్ సిక్సర్లుగా బాదుతాడు.

కానీ ఇషాంత్ శర్మ మాత్రం కచ్చితమైన యార్కర్‌తో రస్సెల్‌కు చెక్ పెట్టి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డ్‌ను కాపాడాడు. సునీల్ నరైన్(39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) విధ్వంసకర బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది. అతనికి తోడుగా అంగ్‌క్రిష్ రఘువంశీ(27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆండ్రీ రస్సెల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41), రింకూ సింగ్(8 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 26) మెరుపులు మెరిపించారు.

Story first published: Wednesday, April 3, 2024, 22:38 [IST]
Other articles published on Apr 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+