Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Manu Bhaker: బుద్దుండాలి.. బుడ్డోడి గురించి అడగడానికి..!

పారిస్ ఒలింపిక్స్ పతక విజేత, భారత షూటర్ మను భాకర్‌‌కు వింత అనుభవం ఎదురైంది. రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ గురించి మను భాకర్‌ను ప్రశ్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒలింపిక్ మెడలిస్ట్‌ను క్రికెట్ గురించి అడుగుతారా? అంటూ మీడియా ప్రతినిధులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) 75వ వార్షికోత్సవ వేడుకలో మనుభాకర్ పాల్గొంది. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన గురించి మీడియా ప్రతినిథులు ఆమెను ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మనుభాకర్ హుందాగా స్పందించింది. సరైన మార్గదర్శకత్వం ఉంటే వయసుతో సంబంధం లేకుండా అద్భుతాలు చేయవచ్చని బదులిచ్చింది.

సరైన గైడెన్స్ ఉంటే..

'సరైన మార్గదర్శకత్వం.. మన చుట్టూ ఉన్న సహవాసం బాగుంటే.. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. టాలెంట్‌కు వయసుతో పనిలేదు. కొందరు 60 ఏళ్ల వయసులోనూ అద్భుతాలు చేస్తుంటారు. 6 ఏళ్ల వయసులోనూ అబ్బురపరిచేవారున్నారు. చుట్టూ ఉన్నవారు వైభవ్‌కు సరైన మార్గదర్శకత్వం అందిస్తే భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతాడు.’అని మను భాకర్ చెప్పుకొచ్చింది.

అయితే ఒలింపిక్ విజేతను యువ క్రికెటర్ గురించి అడగడం ఆమెను అవమానించడమేనని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మను భాకర్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ వ్యక్తిగత విభాగంలో, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మనుభాకర్ కాంస్య పతకాలు సాధించింది. వైభవ్ తరహాలో చిన్నతనం నుంచే షూటర్‌గా మనుభాకర్ రాణిస్తోంది.

Backlash as Olympic Medallist Manu Bhaker Asked About Cricketer Vaibhav Sooryavanshi

బుద్దుండాలి అలా అడగడానికి?

అలాంటి ఆమెను అంతర్జాతీయ క్రికెట్ కూడా ఆడని కుర్రాడి గురించి ప్రశ్నిస్తారా? అని నెటిజన్లు మీడియా తీరును తప్పుబడుతున్నారు. కేకేఆర్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టా చార్య మీడియా తీరును తప్పుబట్టారు. 'మనుభాకర్ ఒలింపిక్ పతక విజేత. వైభవ్ సూర్యవంశీ గురించి అడగడం ఆమె సాధించిన విజయాలను తక్కువ చేయడమే. క్రికెట్ ఎలాగూ దేశంలో ఆధిపత్య క్రీడ. మీ స్పోర్ట్స్ ఎడిటర్‌లకు సూర్యవంశీ గురించి మరో సెలబ్రిటీ అభిప్రాయం అక్కర్లేదు. వీలైతే, తదుపరిసారి వైభవ్ సూర్యవంశీని మను భాకర్ గురించి అడిగి సమాధానాన్ని రాబట్టండి.’అని ఘాటుగా విమర్శించాడు.

ఒలింపిక్ విజేత అయిన మనుభాకర్‌ను వైభవ్ గురించి అడగడం తప్పే అయినప్పటికీ.. ఆ కుర్రాడు సాధిస్తున్న ఘనతలను తక్కువ చేయలేం. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ ఆడటంతో పాటు సెంచరీ బాదిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.

అండర్ 19 క్రికెట్‌లోనూ పరుగుల మోత మోగించాడు. భారత అండర్ 19 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ అద్భుతమైన ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ ముఖచిత్రంగా మారాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌కు క్రికెట్ దిగ్గజాలు అవాక్కవుతున్నారు.

Story first published: Tuesday, April 28, 2026, 13:50 [IST]
Other articles published on Apr 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+