Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

The Hundred లీగ్‌లో అమ్ముడుపోని బాబర్ ఆజామ్.. నెట్టింట తురుమ్‌ఖాన్‌పై పేలుతున్న జోకులు!

Babar Azam trolled after he goes unsold in The Hundred Draft once again

హైదరాబాద్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్(Babar Azam), స్టార్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌లకు ఘోర అవమానం ఎదురైంది. ఇంగ్లండ్ ఫ్రాంచైజీ టోర్నీ 'ది హండ్రెడ్'(The Hundred) లీగ్‌లో వరుసగా రెండో సారి కూడా ఈ పాక్ స్టార్ ఆటగాళ్లు అమ్ముపోలేదు. ది హండ్రెడ్ లీగ్ 2023 సీజన్ డ్రాఫ్ట్‌లో ఈ పాక్ ఆటగాళ్లను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. ఈ ఇద్దరితో పాటు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌, వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్, మార్కస్ స్టోయినిస్‌లు అమ్ముడుపోలేదు.

దాంతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్‌లపై అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. ట్విటర్ వేదికగా ఫన్నీ మీమ్స్, జోకులతో ట్రోల్ చేస్తున్నారు. బాబర్ ఆజమ్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తే రూ.20 కోట్లు పలుకుతాడని ప్రగల్భాలు పలికిన పాక్ మాజీ క్రికెటర్లకు 'ది హాండ్రెడ్' డ్రాఫ్ట్‌లో జరిగిన అవమానం చెంపపెట్టులా మారిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఐపీఎల్‌పై అక్కసు వెళ్లగక్కే బాబర్ ఆజామ్‌కు.. ది హండ్రెడ్ లీగ్‌లో ఫ్రాంచైజీలు బుద్ది చెప్పాయని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

జింబాబ్వే ప్రీమియర్ లీగ్‌లో బాబర్ ఆజామ్‌కు అవకాశం దొరుకుతుందని సెటైర్లు పేల్చుతున్నారు. బాబర్ ఆజామ్ కోసం జర బిడ్ చేయండయ్యా.. అని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. టీ20 ఫార్మాట్‌లో బాబర్ ఆజామ్‌, మహమ్మద్ రిజ్వాన్‌కు ఘనమైన రికార్డులున్నా.. ఫ్రాంచైజీలు వారిని పట్టించుకోలేదు.
అంతేకాకుండా ఇటీవల ముగిసిన పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 సీజన్‌లోనూ ఈ ఇద్దరూ సెంచరీల మోత మోగించారు.

సునీల్ నరైన్, వానిందు హసరంగ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రషీద్ ఖాన్, నాథన్ ఎల్లీస్, షాదబ్ ఖాన్, ఆడమ్ మిల్నే, కోలిన్ మున్రో, కేన్ రిచర్డ్‌సన్, డానియల్ సామ్స్, జోష్ లిటిల్, వేన్ పార్నెల్ వంటి ప్లేయర్లకు 'ది హాండ్రెడ్' డ్రాఫ్ట్‌లో చోటు దక్కింది. ఐపీఎల్ మాదిరిగానే 'ది హాండ్రెడ్' లీగ్‌లో కూడా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ప్లేయర్లకే ఫ్రాంచైజీలు అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. భారత మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలు కూడా ది హండ్రెడ్ లీగ్‌లో చోటు దక్కించుకున్నారు.

సౌతెర్న్ బ్రేవ్ టీమ్ మంధానను రిటైన్ చేసుకోగా.. హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ట్రెంట్ రాకెట్స్ టీమ్ కొనుగోలు చేసింది. పురుషులు, మహిళలకు చెందిన 64 స్థానాలను ఫ్రాంచైజీలు గురువారం పూర్తి చేశాయి.

Story first published: Friday, March 24, 2023, 18:43 [IST]
Other articles published on Mar 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+