Babar Azam: గతం గతః అంతా ఆ అల్లా దయ!
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్‌తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌కు పాకిస్థాన్ సిద్దమైందని ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. గత రికార్డులన్నీ తమకు అనవసరమని, విజయం కోసం తమ సాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పాడు. ఆటగాళ్లుగా చేయాల్సిందంతా చేస్తామని, ఫలితం ఆ అల్లా దయ అని పేర్కొన్నాడు.
ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బాబర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'గతంలో ఏం జరిగిందనేది మాకు అనవసరం. గత రికార్డులపై ఫోకస్ పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఇప్పుడు చేయాలి అన్నదానిపైనే దృష్టి పెట్టడం ముఖ్యం. ఆ దేవుడి దయ ఉంటే ఈ రికార్డులన్నీ బ్రేక్ చేయవచ్చు. 2017, 2021లో ఈ రికార్డులను తిరగ రాశాం.

టికెట్లే అడుగుతున్నారు..
రేపటి మ్యాచ్‌లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. రేపు ఏదైనా జరగవచ్చు. హ్యాట్రిక్ విజయం నమోదు చేసే సత్తా మా జట్టుకు ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో మేం అద్భుత ప్రదర్శన కనబర్చాం. రాబోయే మ్యాచ్‌ల్లోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాం.'అని బాబర్ ఆజామ్ తెలిపాడు.
'భారత్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడి ఉండటం సహజమే కానీ.. స్నేహితులు, బంధువుల నుంచి ప్రపంచకప్‌లో భారత్‌పై మెరుగైన ప్రదర్శన చేయవచ్చు కదా? అనే ప్రశ్నలు తలెత్తడం లేదా?'అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బాబర్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'రికార్డుల గురించి ఎవరూ అడగటం లేదు కానీ.. భారత్-పాక్ టికెట్ల గురంచి మాత్రం ఒత్తిడి తెస్తున్నారు'అని చెప్పిన బాబర్ నవ్వులు పూయించాడు.
ఇదో గొప్ప అవకాశం..
'భారత్-పాకిస్థాన్ మ్యాచ్ బిగ్ గేమ్. ఇరు దేశాల భావోద్వేగాలతో ముడిపడిన మ్యాచ్. మా కుర్రాళ్లందరికి ఒకటే చెప్పా. ఇదో అద్భుత అవకాశం. జట్టు విజయం కోసం అత్యుత్త ప్రదర్శన ఇవ్వండి. ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అహ్మదాబాద్ పెద్ద స్టేడియం. చాలా మంది అభిమానులు వస్తారు.
వారి ముందు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు మనకు దక్కిన గొప్ప అవకాశం ఇది. పెద్ద మైదానాల్లో ఆడటం మాకు కొత్తేం కాదు. మెల్‌బోర్న్ స్టేడియంలో కూడా మేం మ్యాచ్ ఆడాం. కానీ అహ్మదాబాద్ మైదానం పూర్తిగా భారత అభిమానులతో నిండిపోనుంది. పాకిస్థాన్ అభిమానులకు అనుమతి లభిస్తే వారు మాకు మద్దతు తెలపనున్నారు. హైదరాబాద్‌లో మాకు మంచి మద్దతు లభించింది. ఇక్కడ కూడా అలాంటి మద్దతే ఉంటుందని ఆశిస్తున్నా. ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నా.
అతను లేకపోవడం..
నసీమ్ షా దూరమవ్వడం మాకు ఇబ్బంది పెట్టే అంశం. ఆసియా కప్‌లో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కుర్రాడు అయిన అతను అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. రోజు రోజుకి మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. దురదృష్టవశాత్తు అతని సేవలను మేం కోల్పోయాం. షాహిన్ అఫ్రిది మా అత్యుత్తమ బౌలర్. అతను మా చాంపియన్. అతనో బిగ్ మ్యాచ్ బౌలర్.
గత మ్యాచ్‌ల్లో అతను వికెట్లు తీయలేదు. అది పెద్ద విషయమే కాదు. అతనిపై మాకు పూర్తి నమ్మకం ఉంది. భారత్‌తో అతను సత్తా చాటుతాడు.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
అంతా అల్లా దయ..
కీలక మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైనప్పుడు కెప్టెన్సీ కోల్పోవడం గతంలో జరిగిందని, అలాంటి ఆందోళన ఏమైనా ఉందా? అని బాబర్ ఆజామ్‌ను అడగ్గా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 'ఒక్క మ్యాచ్‌తోనే నాకు కెప్టెన్సీ రాలేదు. ఒక్క ఓటమితోనే కెప్టెన్సీ పోదు. ఆ అల్లా నా రాత ఎలా రాస్తే అలానే జరుగుతోంది.
కెప్టెన్సీ గురించి ఎలాంటి టెన్షన్ లేదు. మేం మా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది ఈ అనుభవాన్ని ఆస్వాదించాలి.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications