
కరాచీ: సహచర క్రికెటర్ ప్రేయసితో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడంటూ వచ్చిన ఆరోపణలపై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ స్పందించాడు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. తన జట్టుకే చెందిన ఓ క్రికెటర్ ప్రేయసితో బాబర్ ఆజామ్ సెక్స్ చాట్ చేశాడని, లైంగిక సందేశాలు పంపాడన్న వీడియోలు పాకిస్థాన్ క్రికెట్‌ను ఊపేసాయి.
సోషల్ మీడియాలో లీకైన వీడియోలో బాబర్ ఆజామ్ 'నువ్వు (సహచర క్రికెటర్ ప్రేయసి) ఇలాగే నాతో సెక్స్ చాటింగ్ చేస్తుంటే నీ ప్రియుడు జట్టులో నుంచి బయటకు వెళ్లడు..'అని ఆ అమ్మాయికి బాబర్ హామీ ఇవ్వడం వీడియోలో ఉంది. దాంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. బాబర్ ఆజామ్ హనీ ట్రాప్‌లో పడ్డాడని ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఆరోపణలపై బాబర్ ఆజామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఓ బ్రిడ్జి దగ్గర నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ..'దీని గురించి మరీ అంతగా బాధపడాల్సిందేమీ లేదు. సంతోషంగా ఉండండి'అని ట్వీట్ చేశాడు.
ఇక బాబర్ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించేందుకు బాబర్ ఆజామ్‌పై చేస్తున్న కుట్రని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోలు మార్ఫింగ్ చేశారని, వీటిని ముందుగా షేర్ చేసిన అకౌంట్ ఇప్పుడు కనబడటం లేదని కామెంట్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ల్లో దారుణ ఓటముల తర్వాత బాబర్ ఆజామ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నాలుగైదు రోజుల క్రితం న్యూజిలాండ్‌తో కూడా వన్డే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్థాన్‌కు త్వరలోనే షాన్ మసూద్‌ను టెస్టులు, వన్డేలకు సారథిగా నియమిస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో బాబర్ ఇమేజీని డ్యామేజ్ చేయడానికే ఇలాంటివి చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదీ ఎమైనా బాబర్‌పై వచ్చిన ఆరోపణలతో యావత్ క్రికెట్ లోకం ఉలిక్కిపడింది.