For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారి వల్లే ఈ విజయం.. ఇదే జోరులో భారత్‌ను ఓడిస్తాం: బాబర్ ఆజామ్

లాహోర్: తమ పేసర్ల అసాధారణ ప్రదర్శనతోనే బంగ్లాదేశ్‌పై విజయం సాధించామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. విపరీతమైన వేడీ, ఉక్కపోత వాతావరణంలోనూ తమ బౌలర్లు సత్తా చాటారని కొనియాడాడు. ఆసియాకప్ 2023‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ విజయానంతరం మాట్లాడిన బాబర్ ఆజామ్.. ప్రణాళికలకు తగ్గట్లు తమ బౌలర్లు రాణించారని ప్రశంసించాడు. ఈ విజయం అందించిన ఉత్సాహంతో భారత్‌‌ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 'విపరీతమైన వేడి.. అయినా మా బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ఈ విజయం క్రెడిట్ వారిదే. ముందుగా షాహిన్ అఫ్రిది.. ఆ తర్వాత హారీస్ రౌఫ్ నిప్పులు చెరిగారు.

Babar Azam

ప్రణాళికల్లో భాగంగానే ఫహీమ్‌ను తుతి జట్టులోకి తీసుకున్నాం. పిచ్‌పై గడ్డి ఉండటంతో అతని బౌలింగ్‌కు సరిపోతుందని భావించి అవకాశం ఇచ్చాం. ఇక్కడ ఎప్పుడు ఆడినా మాకు ప్రేక్షల నుంచి మద్దతు లభిస్తోంది. వాళ్లంతా ఈ మ్యాచ్‌ను ఆస్వాదించారని ఆశిస్తున్నా. ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

భారత్‌తో మ్యాచ్‌కు కావాల్సి ఉత్సాహాన్ని అందించింది. ఈ బిగ్ మ్యాచ్‌కు మేందు అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నాం. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు మా సాయశక్తులా ప్రయత్నిస్తాం.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 38.4 ఓవర్లలో 193 పరుగులకు కుప్పకూలింది. హ్యారీస్ రౌఫ్(4/19), నసీమ్ షా(3/34) బంగ్లా పతనాన్ని శాసించగా.. షాహిన్ అఫ్రిది, ఫాహీమ్ అష్రఫ్‌, ఇఫ్తికర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.

బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్(57 బంతుల్లో 7 ఫోర్లతో 53), వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్(87 బంతుల్లో 5 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 39.3 ఓవర్లలో 3 వికెట్లకు 194 పరుగులు చేసి గెలుపొందింది.

ఇమామ్ ఉల్ హక్(84 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78), మహమ్మద్ రిజ్వాన్(79 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, మెహ్‌దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు. పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్‌‌ను ఆదివారం భారత్‌తో ఆడనుంది.

Story first published: Wednesday, September 6, 2023, 22:46 [IST]
Other articles published on Sep 6, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+