For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇక భారత్‌ పని పడతాం: బాబర్ ఆజామ్

ముల్తాన్: ఆసియాకప్ 2023లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. పసికూన నేపాల్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్.. 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ భారీ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్.. ఈ గెలుపు తమ ఆత్మవిశ్వసాన్ని రెట్టింపు చేసిందన్నాడు.

మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఈ విజయ ఉత్సాహంతో భారత్‌ పని పడుతామని తెలిపాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ‌అంటేనే హై ఓల్టేజ్ సమరమని, తమ సాయశక్తులా విజయం కోసం ప్రయత్నిస్తామని తెలిపాడు.

Babar Azam

'నేను క్రీజులోకి వచ్చినప్పుడు బంతి సరిగ్గా బ్యాట్‌మీదకు రాలేదు. దాంతో నేను రిజ్వాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించేందుకు ప్రయత్నించాను. మేం ఇద్దరం ఓ విభిన్నమైన దశలో బ్యాటింగ్ చేశాం. కొన్ని సార్లు రిజ్వాన్ తన ఆటతో నా ఆత్మవిశ్వాసాన్ని పెంచితే.. కొన్నిసార్లు నేను అతనికి నమ్మకం కలిగించాను.

ఇఫ్తికర్ అహ్మద్ సైతం అసాధారణ బ్యాటింగ్ చేశాడు. అతను క్రీజులోకి రాగానే నాచురల్ గేమ్ ఆడమని చెప్పాను. 2-3 బౌండరీలు బాదిన తర్వాత అతను సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేశాడు. కొన్ని ఓవర్లను మేం మా స్థాయికి తగ్గట్లు ఆడ లేదు. కానీ మా పేసర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందివ్వగా.. స్పిన్నర్లు మా విజయాన్ని తేలిక చేశారు.

ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని డబుల్ చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే హైఓల్టేజ్ సమరం. మా సాయశక్తులా విజయం కోసం ప్రయత్నిస్తాం.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 342 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 151), ఇఫ్తికర్ అహ్మద్(71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109 నాటౌట్) సెంచరీలతో చెలరేగగా.. మహమ్మద్ రిజ్వాన్(50 బంతుల్లో 6 ఫోర్లతో 44) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

నేపాల్ బౌలర్లలో సోంపాల్ కమీ రెండు వికెట్లు తీయగా.. కరణ్ కేసీ, సందీప్ లామిచ్చనే తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన నేపాల్ 23.4 ఓవర్లలో 104 పరుగులకు కుప్పకూలింది. షాదాబ్ ఖాన్(4/27) నాలుగు వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించాడు. షాహిన్ షా అఫ్రిది(2/27), హ్యారీస్ రౌఫ్(2/16), రెండేసి వికెట్లు తీయగా.. నసీమ్ షా, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు.

నేపాల్ బ్యాటర్లలో ఆరిఫ్ షేక్(26), సోంపాల్ కమీ(28), గుల్సాన్ జా(13) డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు డకౌటవ్వడం విశేషం.

Story first published: Wednesday, August 30, 2023, 22:30 [IST]
Other articles published on Aug 30, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+