For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంపైర్ తప్పిదమే మా ఓటమిని శాసించింది: బాబర్ ఆజామ్

 Babar Azam says Saud Shakeel dismissal cost Pakistan in 2nd test against England

ముల్తాన్: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో అంపైర్ తప్పిదం కారణంగానే ఓటమిపాలయ్యామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 26 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కోల్పోయిన పాకిస్థాన్.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2023 ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన బాబర్ ఆజామ్.. అంపైర్ తప్పిదం కారణంగా క్రీజులో సెట్ అయిన షకీల్ ఔటవ్వడమే తమ ఓటమిని శాసించిందని చెప్పాడు. అయితే ప్రొషెషనల్ క్రికెటర్‌గా అంపైర్ నిర్ణయాన్ని గౌరవించాలని చెప్పుకొచ్చాడు.

 షకీల్ ఔట్ కావడం వల్లే..

షకీల్ ఔట్ కావడం వల్లే..

'షకీల్‌ ఔటే మా ఓటమికి కారణం. అతను ఇచ్చిన క్యాచ్‌ను ఇంగ్లండ్‌ కీపర్‌ పోప్‌ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినట్లు కనిపించింది. కానీ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా అంపైర్‌ నిర్ణయాన్ని గౌరవించాలి. తొలి ఇన్నింగ్స్‌లో మేం స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాం. కానీ రెండో ఇన్నింగ్స్‌లో బంతితో పాటు బ్యాట్‌తో రాణిచాం. కానీ అది సరిపోలేదు. కొన్ని మంచి భాగస్వామ్యాలు లభించినా విజయాన్ని అందుకోలేకపోయాం. బ్యాటింగ్ విభాగం వైఫల్యం జట్టు ఓటమిని శాసించింది. అరంగేట్ర స్పిన్నర్ అబ్రర్ అదరగొట్టాడు. పిచ్ కండిషన్స్‌ను అద్భుతంగా వాడుకున్నాడు. కరాచీ టెస్ట్‌లోనైనా విజయం కోసం పోరాడుతాం'అని బాబర్‌ చెప్పుకొచ్చాడు.

తోసిపుచ్చిన పోప్..

ఇక తన గ్లోవ్స్‌లోకి పడకముందే బంతి నేలను తాకిందన్న వాదనను ఇంగ్లండ్‌ కీపర్‌ పోప్‌ తోసిపుచ్చాడు. ''నా గ్లోవ్స్‌లోకి రాక ముందే బంతి బౌన్స్‌ అయిందని అనుకోవట్లేదు. బంతి నేరుగా గ్లోవ్స్‌లోకే వెళ్లినట్లు అనిపించింది. గ్లోవ్స్ వేసుకున్న కీపర్‌కు బంతి నేలకు తాకిందా లేదా చెప్పడం కష్టమే.'' అని పోప్‌ తెలిపాడు. 355 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌.. సౌద్ షకీల్(213 బంతుల్లో 8 ఫోర్లు 94) అసాధారణ బ్యాటింగ్‌తో విజయం దిశగా సాగింది. అయితే సెంచరీకి చేరువైన షకీల్.. మార్క్ వుడ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ ఔట్ వివాదాస్పదమైంది.

నేలకు తాకిన బంతి..

నేలకు తాకిన బంతి..

లెగ్ స్టంప్ టార్గెట్‌గా మార్క్ వుడ్ వేసిన బంతిని షకీల్ ఫైన్ లెగ్ వైపు ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమవ్వడంతో అది కాస్త అతని బ్యాట్‌‌ను ముద్దాడుతూ కీపర్ పోప్ చేతిలో పడింది. అయితే బంతిని పోప్ అందుకునే క్రమంలో నేలకు తాకినట్లు అనిపించింది. కానీ స్పష్టంగా కనిపించడం లేదని చెప్పిన థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఔటివ్వడంతో ఔటిచ్చాడు. అయితే నేలకు తాకినట్లు కనిపిస్తున్నా.. అంపైర్ ఎందుకు ఔటివ్వలేదనే చర్చ తెరమీదకు వచ్చింది. షకీల్ ఔటవ్వడం.. పాకిస్థాన్ ఓటమిపాలవ్వడంతో ఈ వికెట్ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.

 ఇంగ్లండ్ చారిత్రాత్మక విజయం..

ఇంగ్లండ్ చారిత్రాత్మక విజయం..

రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 328 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్(4/65) నాలుగు వికెట్లతో చెలరేగడంతో పాకిస్థాన్ లక్ష్యానికి 27 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మహమ్మద్ నవాజ్(62 బంతుల్లో 7 ఫోర్లతో 45)‌తో కలిసి సౌద్ షకీల్ చేసిన పోరాటం వృథా అయ్యింది. ఈ విజయంతో ఇంగ్లండ్ 21 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులకు ఆలౌటవ్వగా.. పాకిస్థాన్ 202 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 275 పరుగులు చేసిన ఇంగ్లండ్.. పాకిస్థాన్‌ను 328 పరుగులకు ఆలౌట్ చేసి విజయాన్నందుకుంది.

Story first published: Tuesday, December 13, 2022, 7:53 [IST]
Other articles published on Dec 13, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+