Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Babar Azam: గతం గత: ఈ సారి భారత్‌కు ఓటమి రుచి చూపిస్తాం! చరిత్ర తిరగరాస్తాం!

 Babar Azam says Past is history, we will win against India In T20 World Cup
Ind vs Pak : అది అప్పుడు.. ఇప్పుడు దెబ్బ మాములుగా ఉండదు - Babar Azam || Oneindia Telugu

Babar Azam on 12-0 record against India in World Cups:టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగే తమ ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమి రుచి చూపిస్తామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. గతం గత: అని, ఈ సారి విజయం సాధించి చరిత్ర తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇక దాయదీ దేశాల మధ్య జరిగే పోరు కోసం యావత్ క్రికెట్ ప్రపంచం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంది. భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమ్మేళనం.! మైదానంలో ఓ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది.! ఆ పోరు ప్రపంచకప్ వేదికగా జరిగితే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఈ పోరును అభిమానులు తమ ప్రతిష్టగా భావిస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ మ్యాచ్ ఫీవర్ మొదలైంది. ఇరు దేశాల మాజీ క్రికెటర్లు తమ దేశాల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి నుంచి ఓ లెక్క..

ఇప్పటి నుంచి ఓ లెక్క..

ఇక ఈ మెగా మ్యాచ్ నేపథ్యంలో బాబర్ ఆజామ్ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మెగా టోర్నీల్లో తమపై భారత్ గెలిచిందనేది వాస్తవేమనని, కానీ అది గతమని, ఇప్పటి నుంచి ఒక లెక్కా! అని బాబర్ భారీ డైలాగ్స్ కొట్టాడు. 'పెద్ద టోర్నీల్లో ఆడేటప్పుడు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలి. మనపై మనకు గట్టి నమ్మకం ఉండాలి. జట్టుగా మేం రెట్టించి ఉత్సాహంతో ఉన్నాం. ఇప్పటివరకు ప్రపంచకప్ వేదికగా టీమిండియాను ఓడించలేదనేది వాస్తవం. కానీ అదంతా గతం. దాని గురించి మాకు అనవసరం. భవిష్యత్తు గురించే మా ఆలోచనంతా. అక్టోబర్‌ 24న జరగనున్న మ్యాచ్‌లో మంచి క్రికెట్ ఆడేందుకు బాగా సన్నదమయ్యాం.

 భారత్‌ను ఓడిస్తాం..

భారత్‌ను ఓడిస్తాం..

భారత్-పాక్ మ్యాచ్ అంటేనే తీవ్రతతో కూడుకున్నది. ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అయితే ఆ పరిస్థితులను, ఒత్తిడిని అధిగమించేందుకు అన్ని రకాలుగా సిద్దమయ్యాం. మ్యాచ్‌లో మేం ప్రశాంతంగా ఉంటూ క్రికెట్‌పైనే దృష్టిపెట్టాల్సి అవసరం ఉంది. యూఏఈ పరస్థితులు మాకు బాగా తెలుసు. గత మూడు, నాలుగేళ్లుగా మేం ఇక్కడ క్రికెట్ ఆడాం. ఇక్కడి వికెట్లు ఎలా ఉంటాయో, పరిస్థితులకు తగ్గట్లు బ్యాట్స్‌మెన్ ఎలా ఆడాలో మాకు అవగాహన ఉంది. మ్యాచ్ జరిగే రోజు ఎవరు మెరుగ్గా రాణిస్తే వారిదే విజయం. మా లక్ష్యం మాత్రం గొప్పగా ఆడటం. ఎవరు గెలుస్తారనే మీరు అడిగితే మాత్రం మేమే గెలుస్తామని చెబుతా. విజయానికి కావాల్సిన అన్ని ప్రణాళికలు రచించుకున్నాం. మా దగ్గర ఉన్న అస్త్ర శ్రస్తాలతో టీమిండియాతో మ్యాచ్‌కు బరిలోకి దిగుతున్నాం. ఈసారి కచ్చితంగా విజయం మాదే అవుతుంది.'అని బాబర్ ధీమా వ్యక్తం చేశాడు.

12-0తో భారత్‌దే ఆధిపత్యం..

12-0తో భారత్‌దే ఆధిపత్యం..

మెగా టోర్నీల్లో పాకిస్థాన్ ఇప్పటి వరకు భారత్‌ను ఓడించలేకపోయింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు సార్లు తలపడగా ఐదింటికి ఐదు ఇండియానే గెలిచింది. వన్డే ప్రపంచకప్‌లో ఏడు సార్లు తలపడగా ఏడింటిలోనూ భారతే విజయం సాధించింది. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో మాత్రం ఇరు జట్లు ఐదుసార్లు తలపడగా.. రెండు సార్లు టీమిండియా.. మూడుసార్లు పాకిస్తాన్‌ విజయం సాధించింది. ఇందులో 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కూడా ఉంది. తాజా మ్యాచ్ విజయంతో ఈ ఆధిపత్యాన్ని భారత్ 13-0గా మారుస్తుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. భారత జట్టులో అంతా మ్యాచ్ విన్నర్లే ఉన్నారని సునాయసంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Friday, October 22, 2021, 19:17 [IST]
Other articles published on Oct 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+