Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Babar Azam: గట్ల భయపడితే ఎలా అన్నా?

అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా భారత్‌తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌లో ఎదురయ్యే ఫలితం గురించి తమకు ఎలాంటి ఆందోళన లేదని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. ముఖ్యంగా తన కెప్టెన్సీ పోతుందేమోననే భయం అస్సలే లేదని స్పష్టం చేశాడు. ఇలా భయపడితే ఈ స్థాయికి చేరుకోలేమన్నాడు.

విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని, భవిష్యత్తు గురించి ఆందోళన పడే తత్వం తనది కాదని బాబర్ ఆజామ్ స్పష్టం చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శనివారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్న బాబర్ ఆజామ్‌కు కెప్టెన్సీ గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

 Babar Azam Says Neither did I get captaincy for one match nor will I lose it because of one match

'ఈ మధ్య క్రికెట్ టీమ్స్ ప్రొఫెషనల్‌గా కెప్టెన్‌కు అండగా ఉండటం కంటే ఓటమికి బాధ్యుడ్ని చేస్తూ ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నాయి. ఆ ఆందోళన ఏమైనా మిమ్మల్ని వెంటాడుతుందా?'అని ఓ జర్నలిస్ట్ బాబర్ ఆజామ్‌ను అడగ్గా తనదైన శైలిలో బదులిచ్చాడు.

'ఒక్క మ్యాచ్‌తోనే నాకు కెప్టెన్సీ రాలేదు. ఒక్క ఓటమితోనే నా కెప్టెన్సీ పోదు. ఆ అల్లా నా రాత ఎలా రాస్తే అలానే జరుగుతోంది. కెప్టెన్సీ గురించి ఎలాంటి టెన్షన్ లేదు. భారత్‌తో మ్యాచ్‌లో మేం మా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తున్నాం. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని మెరుగైన ప్రదర్శన ఇవ్వడంపై ఫోకస్ పెట్టాం. అన్నిటి కంటే ముఖ్యమైనది ఈ అనుభవాన్ని ఆస్వాదించాలి.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.

'భారత్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడి ఉండటం సహజమే కానీ.. స్నేహితులు, బంధువుల నుంచి ప్రపంచకప్‌లో భారత్‌పై మెరుగైన ప్రదర్శన చేయవచ్చు కదా? అనే ప్రశ్నలు తలెత్తడం లేదా?'అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బాబర్ తనదైన శైలిలో బదులిచ్చాడు. 'రికార్డుల గురించి ఎవరూ అడగటం లేదు కానీ.. భారత్-పాక్ టికెట్ల గురించి మాత్రం ఒత్తిడి తెస్తున్నారు'అని చెప్పిన బాబర్ నవ్వులు పూయించాడు.

'గతంలో ఏం జరిగిందనేది మాకు అనవసరం. గత రికార్డులపై ఫోకస్ పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఇప్పుడు చేయాలి అన్నదానిపైనే దృష్టి పెట్టడం ముఖ్యం. ఆ దేవుడి దయ ఉంటే ఈ రికార్డులన్నీ బ్రేక్ చేయవచ్చు. 2017, 2021లో ఈ రికార్డులను తిరగ రాశాం.'అని బాబార్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, October 13, 2023, 21:19 [IST]
Other articles published on Oct 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+