For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Babar Azam: అతని వల్లే ఈ ఓటమి

World Cup 2023: డేవిడ్ వార్నర్ వంటి విధ్వంసకర బ్యాటర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను నేలపాలు చేయడం తమ పతనాన్ని శాసించిందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన పాకిస్థాన్ 62 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన బాబర్ ఆజామ్.. కీలక క్యాచ్‌లు నేలపాలు చేయడంతో పాటు పవర్ ప్లేలో సరిగ్గా బౌలింగ్ చేయకపోవడం, బ్యాటింగ్‌లో కీలక భాగస్వామ్యాలు నమోదు చేయకపోవడం వంటి కారణాలు ఓటమిని శాసించాయని చెప్పాడు. 'ఈ మ్యాచ్‌లో మేం మా స్థాయికి తగిన రీతిలో బౌలింగ్ చేయలేదు.

Babar Azam says need better in the middle overs with the bat After AUS beat PAK in CWC 2023

డేవిడ్ వార్నర్ వంటి విధ్వంసకర బ్యాటర్ క్యాచ్‌ను నేలపాలు చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది. ఇది బిగ్ స్కోరింగ్ గ్రౌండ్. చిన్న తప్పిదాలు కూడా ఓటమిని శాసిస్తాయి. చివర్లో మా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి ఆసీస్‌ భారీ స్కోర్‌ను అడ్డుకోగలిగారు. సరైన లెంగ్త్‌తో పాటు స్టంప్‌ను హిట్ చేసి ఫలితాన్ని రాబట్టారు.

ఇప్పుడు మేం చేయాల్సింది ఒక్కటే.. గతంలో మాదిరి ప్రతీ మ్యాచ్ గెలుస్తూ నాకౌట్ చేరడంపై ఫోకస్ పెట్టడమే. అండర్ ద లైట్స్ బంతి ముద్దుగా బ్యాట్ మీదకు వచ్చింది. కానీ మేం భారీ భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయాం. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో మా బ్యాటింగ్ మరీ పేలవంగా తయారైంది. పవర్ ప్లేలోనూ కట్టడిగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మిడిల్ ఓవర్లలో మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగుల భారీ స్కోర్ చేసింది. డేవిడ్ వార్నర్(124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్‌లతో 163), మిచెల్ మార్ష్(108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121) సెంచరీలతో చెలరేగారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(5/52) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. హ్యారీస్ రౌఫ్(3/83) మూడేసి వికెట్లు తీయగా.. ఉసామా మీర్(1/82) ఓ వికెట్ తీసాడు. పాకిస్థాన్ చెత్త ఫీల్డింగ్ ఆసీస్ బ్యాటర్లకు కలిసొచ్చింది.

10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డేవిడ్ వార్నర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఉసామా మీర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో ఆకాశమే హద్దుగా చెలరేగిన వార్నర్ విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. సెంచరీ అనంతరం అతను ఇచ్చిన మరో క్యాచ్‌ను డీప్ మిడ్ వికెట్‌లో అబ్దుల్లా షఫీక్ నేలపాలు చేశాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 45.3 ఓవర్లలో 305 పరుగులకు కుప్పకూలింది. అబ్దుల్లా షఫీక్(61 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64), ఇమామ్ ఉల్ హక్(71 బంతుల్లో 10 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, మార్కస్ స్టోయినీస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్ తలో వికెట్ తీసారు.

Story first published: Friday, October 20, 2023, 22:51 [IST]
Other articles published on Oct 20, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+