For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాల్ బాయ్‌గా పనిచేసేందుకు రోజు మూడు మైళ్లు నడిచేవాడిని : పాక్ క్రికెటర్

Babar Azam recalls walking 3 miles to reach Gaddafi stadium, work as a ball-boy

ఇస్లామాబాద్ : క్రికెటర్‌గా ఎదగాడానికి తానెంతో కష్టపడ్డానని పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్ తెలిపాడు. తన చిన్నతనంలో ఓ మ్యాచ్‌కు బాల్‌బాయ్‌గా పనిచేసేందుకు రోజులు మూడు మైళ్లు నడిచేవాడినని, ఆ కష్టమే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందన్నాడు. శ్రీలంక టెర్రర్ అటాక్ అనంతరం దాదాపు 10 ఏళ్లు పాకిస్థాన్ గడ్డపై ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు. ఐసీసీ మొత్తుకున్నా.. పీసీబీ(పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) చేతులు చాచి అభ్యర్థించినా ఏ దేశం.. మరే జట్టు పాక్ వైపు కన్నెత్తి చూడలేదు.

అయితే ఇటీవల శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించడంతో ఆదేశంలో క్రికెట్ కార్యకలపాలు మొదలయ్యాయి. ఇప్పుడు బంగ్లాదేశ్‌ లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌ కోసం పాక్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో పాక్ జట్టును బాబర్ ఆజమ్ నడిపించనున్నాడు.

జట్టు ప్రక్షాళనతో జట్టులోకి వచ్చిన కొత్త, పాత ఆటగాళ్లతో బాబార్ ఆజమ్ బరిలోకి దిగనున్నాడు. సొంత గడ్డపై కెప్టెన్‌గా అతనికిది తొలి సిరీస్. ఈ నేపథ్యంలో బాబర్ మీడియాతో మాట్లాడుతూ తన విజయం వెనుకున్న కష్టాలను పంచుకున్నాడు.

'2007లో సౌతాఫ్రికా-పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌కు బాల్ బాయ్‌గా పనిచేసేందుకు నేను రోజు 3 మైళ్ల దూరంలో ఉన్న గడ్డాఫి స్టేడియంకు నడుచుకుంటూ వెళ్లే వాడిని. కేవలం ఆటపై ఉన్న మక్కువ.. స్టార్ క్రికెటర్లు ఇంజుమామ్ ఉల్ హక్, యూనీస్ ఖాన్, మహ్మద్ యూసఫ్, మిస్బా ఉల్ హక్, గ్రేమ్ స్మిత్, హషీం ఆమ్లా, జాక్వస్ కల్లీస్, డేల్ స్టేయిన్ ఉన్నప్రేమే నన్ను నడిపించింది. ఆ మ్యాచ్‌లో టెస్ట్ మ్యాచ్‌ను, దిగ్గజ ఆటగాళ్లను దగ్గరగా చూసే అవకాశం దక్కింది. ఇది నా క్రికెట్ కెరీర్‌కు ఇన్సెంటివ్‌గా ఉపయోగపడింది. ప్రతి యువ ఆటగాడికి ఓ లైఫైటైమ్ అనుభవం ఉంటుంది. నాకు ఆ మ్యాచే.'అని బాబర్ తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నాడు.

వన్డే వరల్డ్‌కప్ పరాజయం అనంతరం సర్ఫరాజ్ అహ్మద్ పై వేటువేసిన పీసీబీ.. బాబర్ ఆజమ్‌ను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియతో 0-2తో టీ20 సిరీస్‌ను పాక్ చిత్తుగా ఓడటంతో బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు సీనియర్ క్రికెటర్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లను ఎంపికచేసింది.

Story first published: Thursday, January 23, 2020, 15:32 [IST]
Other articles published on Jan 23, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+