For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ఇచ్చిన ఆ సలహాతోనే నా బ్యాటింగ్‌ మెరుగైంది: బాబర్ ఆజామ్

Babar Azam recalls how Virat Kohli’s advice helped him improve his game

కరాచీ: నెట్ సెషన్స్‌లో సీరియస్‌గా ప్రాక్టీస్ చేయాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాతో తన ఆట చాలా మెరుగైందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో దుమ్ములేపుతున్న బాబర్ ఆజామ్.. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 103, 31, 94తో రాణించిన బాబర్ ఆజామ్.. 228 రన్స్‌తో రాణించి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో వన్డే ర్యాంకింగ్స్‌లో నెం1 స్థానాన్ని అందుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడిన విరాట్.. హాఫ్ సెంచరీలతో రాణించినా తన మార్క్ పెర్ఫామెన్స్ రాణించలేకపోయాడు. దాంతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు.

 విరాట్ సలహా..

విరాట్ సలహా..

వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా సహచర క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్‌తో బాబర్ చిట్‌చాట్ చేయగా.. ఆ వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ చిట్ చాట్ సందర్భంగా కోహ్లీ ఇచ్చిన సలహాను బాబర్ గుర్తు చేసుకున్నాడు. 'గతంలో నేను నెట్ ప్రాక్టీస్‌ను చాలా లైట్ తీసుకునేవాడిని. ఆ తర్వాత నెమ్మదిగా ఈ అలవాటును మార్చుకున్నా. నెట్ సెషన్స్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నా. అక్కడ కష్టపడితేనే మైదానంలో సత్తా చూపగలమని గ్రహించా. ఈ క్రమంలోనే ఓసారి విరాట్ కోహ్లీతో మాట్లాడినప్పుడు అతను నాకు విలువైన సలహా ఇచ్చాడు.

నెట్ సెషన్స్..

నెట్ సెషన్స్..

నెట్ సెషన్స్‌ను మ్యాచ్‌లానే భావించాలని కోహ్లీ సూచించాడు. ఎందుకంటే నెట్స్‌లో నిర్లక్ష్యపు షాట్స్ ఆడితే మ్యాచ్‌లో కూడా అలానే ఆడుతామని చెప్పాడు. నెట్స్‌లో మన ప్రవర్తన ఎలా ఉంటే మ్యాచ్‌లో కూడా అలానే ఉంటుందన్నాడు. అతని సలహా నాకు చాలా ఉపయోగపడింది. అప్పటి నుంచి నేను ప్రాక్టీస్ సెషన్‌లో చాలా సిరీయస్‌గా పాల్గొంటున్నా. నెట్స్‌లో నా బ్యాటింగ్‌ పట్ల సంతృప్తి చెందకున్నా.. లేదా నా నెట్ సెషన్స్ బాగా సాగకున్నా.. ఆ రోజు మొత్తం నేను చాలా డిస్టర్బ్‌గా ఉంటా.'అని బాబర్ చెప్పుకొచ్చాడు.

 నాలుగో పాక్ క్రికెటర్‌గా..

నాలుగో పాక్ క్రికెటర్‌గా..

సౌతాఫ్రికా పర్యటనలో రాణించి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్న బాబర్ ఆజామ్.. ఈ ఫీట్ సాధించిన నాలుగో పాక్ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. బాబర్ కన్నా ముందు జహీర్ అబ్బాస్(1983-84), జావెద్ మియాందాద్(1988-89), మహ్మద్ యూసఫ్(2003) మాత్రమే వన్డేల్లో టాప్ ర్యాంక్ సాధించారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు 837 పాయింట్లతో ఉన్న బాబర్ ఆజామ్.. ఫైనల్ మ్యాచ్ అనంతరం 865 పాయింట్లతో టాప్‌లోకి దూసుకెళ్లాడు.

 బాబర్‌ను చూసి విరాట్ నేర్చుకోవాలి..

బాబర్‌ను చూసి విరాట్ నేర్చుకోవాలి..

స్వింగ్ బాల్స్‌కు తడబడే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆ సమస్యను అధగమించేందుకు బాబర్ ఆజామ్‌ సాయం తీసుకోవాలని ఇటీవల పాకిస్థాన్ మాజీ పేసర్ అకిబ్ జావెద్ సూచించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ టెక్నిక్‌లో బాబర్ ఆజామ్‌కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌లానే ఎలాంటి సమస్యలు, బలహీతలు లేవన్నాడు. కాకపోతే ఫిట్‌నెస్ విషయంలో బాబర్ ఆజామ్.. విరాట్ కోహ్లీని ఫాలో అవ్వాలని, అలా చేస్తే అతను మరింత గొప్ప ప్లేయర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు.

Story first published: Wednesday, April 14, 2021, 20:37 [IST]
Other articles published on Apr 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+