Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సైనీ బీమర్.. రాహుల్ పొట్టలోకి పంచ్ విసిరిన ఫించ్!! (వీడియో)

India vs Australia 2nd ODI: Aaron finch hitting KL Rahuls Stomach

సిడ్నీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వ‌న్డేలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లోని 11.5వ బంతిని టీమిండియా పేసర్ నవదీప్ సైనీ బీమర్‌గా సంధించాడు. గంటకు 145.6 కి.మీ వేగంతో దూసుకొచ్చిన ఆ బంతి కాస్త కెప్టెన్ ఆరోన్ ఫించ్ పొట్ట మీద తాకింది. వెంటనే ఫించ్ నొప్పితో బాధపడ్డాడు. అయితే అదృష్టవశాత్తు పెద్ద దెబ్బ తగలలేదు. వెంటనే సైనీ ఆసీస్‌కు కెప్టెన్‌కు సారీ చెప్పాడు.

పంచ్ ఇచ్చిన ఫించ్

ఆరోన్ ఫించ్‌కు బంతి తగలగానే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అతని దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. దెబ్బ ఎక్కడ తాకింది అన్నట్టు.. రాహుల్ నవ్వుతూ ఫించ్ పొట్ట మీద చేయి పెట్టబోయాడు. ఫించ్ నవ్వుతూ రాహుల్ చేతిని తీసేసి.. అతని పొట్టలోకి పంచ్ విసిరాడు. దీంతో అక్కడే ఉన్న చహల్ నవ్వుకున్నాడు. కామెంటేటర్లు కూడా ఈ సన్నివేశం చూసి సరదాగా నవ్వుకున్నారు. టీవీల్లో చూసిన ఫాన్స్ కూడా దెబ్బ అక్కడ తగల్లేదు కదా అని జోకులు పేల్చారు. ఇక రాహుల్, ఫించ్‌తోనే ఉన్న డేవిడ్ వార్నర్ మాత్రం ఇదేమి పట్టించుకోకుండా.. మంచినీరు కావాలని డ్రెసింగ్ రూం వైపు సైగలు చేశాడు.

ఫించ్ ఓకేనా?

ఫించ్ ఓకేనా?

నవదీప్ సైనీ వేసిన ఆ బంతి ఎత్తుగా రావడంతో ఫీల్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించారు. ఫ్రీ హిట్ బాల్‌‌కు ఆరోన్ ఫించ్ సింగిల్ కూడా తీయలేకపోయాడు. అయితే ఆ తర్వాతి షార్ట్ బాల్‌ను బౌండరీ బాది సైనీపై బదులు తీర్చుకున్నాడు. 15 ఓవర్లు ముగిశాక ఆసీస్ డ్రింక్స్ బ్రేక్ తీసుకుంది. ఈ సందర్భంగా ఫించ్ ఓకేనా? అని కామెంటేటర్లు వార్నర్‌ను సరదాగా ప్రశ్నించారు. అంతా ఓకే అంటూ వార్నర్ రిప్లై ఇచ్చాడు. రాహుల్, ఫించ్‌లకు సంబందించిన ఆ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు ఈ వీడియోపై జోకులు పేల్చుతున్నారు.

ఫించ్, వార్నర్ అర్ధ శతకాలు

ఫించ్, వార్నర్ అర్ధ శతకాలు

రెండో వ‌న్డేలోనూ ఆసీస్ ఓపెన‌ర్లు చెల‌రేగుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌, ఆరోన్ ఫించ్ మ‌రోసారి మంచి ఆరంభాన్నిచ్చారు. మొద‌టి నుంచీ ధాటిగా ఆడుతున్న వార్న‌ర్.. హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కేవ‌లం 39 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో అర్ధ శతకం చేశాడు. మరోవైపు ఫించ్ 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 60 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 142 ప‌రుగుల తొలి వికెట్ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. మరికొద్ది సేపటికే వార్నర్ (83) కూడా పెవిలియన్ చేరాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 27 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల నష్టానికి 164 ప‌రుగులు చేసింది.

బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని సంపాదించా!! కోహ్లీ.. మీ టీమ్‌లో నాకు చోటిస్తావా: స్టార్‌ ఫుట్‌బాలర్

Story first published: Sunday, November 29, 2020, 11:30 [IST]
Other articles published on Nov 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+