Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదేందయ్యా ఇది.. బోడి గుండుతో షాకిచ్చిన బాబర్ ఆజామ్! (వీడియో)

హైదరాబాద్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ న్యూ లుక్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మైదానంలో తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బాబర్ ఆజామ్.. ఒక్కసారిగా బోడి గుండుతో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చాడు. ప్రస్తుతం బాబర్ ఆజామ్ బోడి గుండు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

క్యాప్ తీసి గుండు బాస్ అంటూ బాబార్ ఆజామ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బోడి గుండుతో కారులో దిగిన ఓ ఫొటో మీమర్స్‌కు మంచి కంటెంట్‌గా మారింది. బాబర్ బోడి గుండుతో మీమర్స్ ఫన్నీ పోస్ట్‌లతో నవ్వులు పూయిస్తున్నారు.

Babar Azam New look ahead of Pakistan tour of Sri Lanka goes viral

అభిమానులు కూడా బాబర్ ఆజామ్ న్యూ లుక్‌పై సరదా కామెంట్స్ చేస్తున్నారు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఓడిపోతే.. 'మీ అభిమానులు నీకు బోడి గుండు కొట్టిస్తారని ముందే చేసుకున్నావా?’ అని సెటైర్లు పేల్చుతున్నారు.

కొందరైతే ఈ లుక్ నీకు బాగా సూటైందని ఎటకారం చేస్తుంటే.. మరికొందరు పుష్పలోని భన్వార్ సింగ్ షేఖావత్ పాత్రను చూసి బాబర్ ఆజామ్ బోడి గుండు కొట్టుకున్నట్లున్నాడని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. హెయిర్ ఫాల్‌‌ను కవర్ చేసేందుకే బాబర్ ఆజామ్ గుండు కొట్టించాడని మరికొందరు ఆరోపిస్తున్నారు. అసలు ఇది రియల్ ఫోటోనేనా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఫేమస్ డైలాగ్ బాస్ గుండూ బాస్ అనే డైలాగ్‌తో బాబర్ వీడియోను పెట్టి నవ్వులు పూయిస్తున్నారు. పాకిస్థాన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లను చివరిసారిగా ఆడిన బాబర్ ఆజమ్.. విశ్రాంతి సమయాన్ని కుటుంబంతో గడిపాడు. న్యూజిలాండ్‌తో సత్తా చాటిన బాబర్ ఆజామ్ ఐదు వన్డేల్లో 276 రన్స్ చేశాడు.

ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఐదు టీ20ల సిరీస్‌లో 130 పరుగులే చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండటం గమనార్హం. వన్డే సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న పాక్.. టీ20 సిరీస్‌ను 2-2తో గెలుచుకుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌కు బాబర్ ఆజామ్ సన్నదమవుతున్నాడు. కొత్త బ్యాట్‌తో నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.

Story first published: Tuesday, July 4, 2023, 10:51 [IST]
Other articles published on Jul 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+