Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WI vs PAK: ఎంత పనాయేరా ఆజామూ.. మూడేళ్లుగా తీరని ముచ్చట!

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సెంచరీ నిరీక్షణ కొనసాగుతోంది. గత మూడేళ్లుగా ఈ పాకిస్థాన్ బ్యాటర్ ఒక్క శతకం నమోదు చేయలేపోయాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తృటిలో శతకం చేజార్చుకున్నాడు. 147 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 88 పరుగులతో సెంచరీకి చేరువైన బాబర్ ఆజామ్‌ను దురదృష్టం వెంటాడింది. మరో 12 పరుగులు చేస్తే సెంచరీ పూర్తవుతుందనగా.. అబ్దుల్లా షఫీక్‌తో సమన్వయం లోపం కారణంగా రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.

ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. మళ్లీ ఆ సీటు మనదే!

ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. మళ్లీ ఆ సీటు మనదే!

పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 75వ ఓవర్‌లో జోమల్ వారిగన్ వేసిన బంతిని బాబర్ కవర్స్ వైపు ఆడి క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు. కానీ మరో ఎండ్‌లో ఉన్న అబ్దుల్లా షఫీక్‌ పరుగుకు నిరాకరించాడు. దాంతో హాఫ్ క్రీజు ధాటిన బాబర్ ఆజామ్ యూటర్న్ తీసుకొని వెనక్కిపరుగెత్తేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్రాండన్ కింగ్ డైరెక్ట్ హిట్‌తో స్టంప్స్‌ను పడేసి బాబర్ ఆజామ్‌ను రనౌట్ చేశాడు. దాంతో బాబర్ ఆజామ్ డైవ్ చేసినా లాభం లేకుండా పోయింది.

Babar Azam Left Heartbroken After Unfortunate Run-Out Denies Him Test Century against West Indies

ఏడోసారి రనౌట్..

టెస్ట్ క్రికెట్‌లో బాబర్ ఆజామ్ రనౌట్ కావడం ఇది ఏడోసారి. దాంతో పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధికసార్లు రనౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో అజార్ అలీ, వసీమ్ అక్రమ్‌లతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.8 రనౌట్‌లతో జావేద్ మియాందాద్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బాబార్ ఆజామ్ తన చివరి టెస్ట్ సెంచరీని డిసెంబర్ 2022లో నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో కరాచీ వేదికగా జరిగిన టెస్ట్‌లో 161 పరుగులతో ఈ ఫీట్ అందుకున్నాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో 9వ శతకం, ఆ తర్వాత మూడున్నరేళ్లుగా టెస్ట్‌ల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు.


ఆధిక్యంలో పాక్..

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్(73), రోస్టన్ ఛేజ్(70) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్(4/85) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ అలీ(2/67),ఉబైద్ షా(2/66), అలీ ఉస్మాన్(2/80) రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. కెప్టెన్‌గా మారినా ఆట మాత్రం మారదు!

Also Read

ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. కెప్టెన్‌గా మారినా ఆట మాత్రం మారదు!

అనంతరం పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్లా షఫీక్(323 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 160) సెంచరీతో రాణించగా.. బాబర్ ఆజామ్(147 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 88) రాణించాడు. అనంతరం వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 103 పరుగులు చేసింది.

Story first published: Wednesday, August 5, 2026, 14:33 [IST]
Other articles published on Aug 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+