Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓరే ఆజామూ.. 1000 రోజులు మింగేసావ్! రిటైర్మెంట్ ఇచ్చేయ్!

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ వైఫల్యం కొనసాగుతోంది. సౌతాఫ్రికాతో రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ బాబర్ ఆజామ్(16) తీవ్రంగా నిరాశపర్చాడు. లాహోర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లోనూ 23, 42 పరుగులతో విఫలమయ్యాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేలవ ప్రదర్శనతో ఇప్పటికే వైట్ బాల్ ఫార్మాట్ టీమ్‌లో చోటు కోల్పోయిన బాబర్ ఆజామ్.. కేవలం రెడ్ బాల్ క్రికెట్‌‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. కానీ ఈ ఫార్మాట్‌లోనూ అతను రాణించడం లేదు.

టెస్ట్‌ల్లో అతను సెంచరీ చేయక మూడేళ్లు అవుతుంది. చివరిసారిగా 2022లో న్యూజిలాండ్‌పై కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజామ్(161) సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 28 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడిన బాబర్ ఆజామ్ ఒక్క సెంచరీ నమోదు చేయలేదు. అతను చివరి సెంచరీ చేసి 1030 రోజులు అవుతుంది. ఈ 28 ఇన్నింగ్స్‌ల్లో మూడే హాఫ్ సెంచరీలు 24 సగటుతో 651 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే అతను రిటైర్మెంట్ ప్రకటించడమే ఉత్తమమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Babar Azam Faces Social Media Trolls Over 1030-Day Century Drought in Test Cricket

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేసింది. బాబర్ ఆజామ్ విఫలమైనా.. షాన్ మసూద్(176 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87), సౌద్ షకీల్(147 బంతుల్లో 4 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్(7/102) ఏడు వికెట్లతో సత్తా చాటాడు. సిమన్ హర్మర్ రెండు వికెట్లు తీయగా.. కంగిసో రబడా ఓ వికెట్ తీసాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆచితూచి ఆడుతోంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(32), ర్యాన్ రికెల్టన్(14) ఔటైనా.. ట్రిస్టన్ స్టబ్స్(62 బ్యాటింగ్), టోనీ డీ జోర్జీ(55 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. 58 ఓవర్లు పూర్తయ్యే సరికి సౌతాఫ్రికా 2 వికెట్లకు 167 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, సజిద్ ఖాన్ చెరో వికెట్ తీసారు.

Story first published: Tuesday, October 21, 2025, 17:16 [IST]
Other articles published on Oct 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+