ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది: బాబర్ ఆజామ్
ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగడం తమకు కలిసొచ్చిందని పాకిస్థాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. విజయం సాధించినప్పుడు సంతృప్తిగా ఉంటుందని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ అద్భుత బ్యాటింగ్, స్పిన్నర్ల అసాధారణ ప్రదర్శనతో విజయం దక్కిందని చెప్పాడు.
మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విదేశాల్లో పాకిస్థాన్ తొలి టెస్ట్ విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం ముగిసిన రెండో టెస్ట్‌లో బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ 1-1తో సమం చేసింది. వరుసగా 8 విదేశీ టెస్ట్ పరాజయాల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది.
అందుకే సీనియర్లను పక్కనపెట్టాం..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన బాబర్ ఆజామ్..ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగడం కలిసొచ్చిందని చెప్పాడు. దాంతో సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నాడు. 'విజయం సాధించినప్పుడు సంతృప్తిగా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేశాం. తొలి ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ బ్యాటింగ్ చేసిన తీరు.. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు బౌలింగ్ చేసిన విధానం మా ప్రణాళికలకు తగ్గట్లుగానే సాగింది.

ఈ సిరీస్ కోసం మేం గత మూడు నెలలుగా లాహోర్‌లోని ఎన్‌సీఏలో ప్రత్యేక క్యాంప్‌తో సన్నదమయ్యాం. మేం ఈ పిచ్‌ను చూసినప్పుడు పాకిస్థాన్ తరహా వికెట్‌లా కనిపించింది. అందుకే మేం అదనంగా ఒక స్పిన్నర్‌ను ఆడించాలని నిర్ణయించుకున్నాం. ఇది మా కాంబినేషన్‌పై ప్రభావం చూపించింది. ఫలితంగా మా సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టాల్సి వచ్చింది. నా వేలు కొంచెం నొప్పిగానే ఉంది కానీ పర్వాలేదు. కొద్ది కమిలింది అంతే'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్ ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్(73), రోస్టన్ ఛేజ్(70) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్(4/85) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ అలీ(2/67),ఉబైద్ షా(2/66), అలీ ఉస్మాన్(2/80) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్లా షఫీక్(323 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 160) సెంచరీతో రాణించగా.. బాబర్ ఆజామ్(147 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 88) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్(6/112) ఆరు వికెట్లు తీయగా.. షమార్ జోసెఫ్(2/84) రెండు వికెట్లు పడగొట్టగా.. జైడన్స్ సీల్స్ ఒక వికెట్ తీసాడు.
అనంతరం వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 117 పరుగులకు కుప్పకూలింది. కావెమ్ హోడ్జ్(34) మినహా అంతా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్ నాలుగేసి వికెట్లు తీసారు. మహమ్మద్ అలీకి ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

