For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs SL: బాబర్ ఆజామ్‌‌కు దక్కని చోటు

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్థాన్ మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ వెటరన్ బ్యాటర్ బాబర్ ఆజామ్‌పై వేటు వేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో జట్టు ఓటమికి కారణమైన బాబర్ ఆజామ్ చర్యలు తీసుకుంది. మొత్తం మూడు మార్పులతో బరిలోకి దిగింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఇది మంచి పిచ్.. మ్యాచ్ సాగుతున్న కొద్దీ మంచు ప్రభావం కూడా ఉండవచ్చు. మేం బేసిక్స్ తగ్గట్లు ఆడాలి.

Babar Azam Excluded from Pakistan s Playing XI for T20 World Cup 2026 Super 8 vs Sri Lanka

ఈ రాత్రి మూడు విభాగాల్లోనూ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) రాణించాల్సి ఉంది. గెలిచినా ఓడినా.. అభిమానులు ఎప్పుడూ మాకు మద్దతుగా ఉంటారు, అది మాకు మంచి ప్రేరణనిస్తుంది. మా జట్టులో రెండు మార్పులు చేశాం.'అని షనక పేర్కొన్నాడు.

సెమీఫైనల్ చేరేందుకు తమకు ఇదొక గొప్ప అవకాశమని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తెలిపాడు. 'ఇదొక గొప్ప అవకాశం. మేం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంది. అప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుంది. మేం ఒక మంచి స్కోరును బోర్డుపై ఉంచి, వారిని తక్కువ పరుగులకే కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాం. ఏం చేయాలో తెలిసినప్పుడు కొన్నిసార్లు అది కష్టంగా అనిపించవచ్చు. మరికొన్నిసార్లు సులభంగా అనిపించవచ్చు. ఇదొక మిశ్రమ అనుభూతి. మా జట్టులో మూడు మార్పులు చేశాం.'అని సల్మాన్ అఘా పేర్కొన్నాడు.

తుది జట్లు:

పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), ఖ్వాజా నఫయ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్.

శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కమిల్ మిషారా (వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక (కెప్టెన్), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలాగే, మహేష్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షాన్ మదుశంక.

Story first published: Saturday, February 28, 2026, 19:01 [IST]
Other articles published on Feb 28, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+