Babar Azam: టీ20ల్లో అరుదైన రికార్డు.. పాకిస్తాన్ కెప్టెన్ తర్వాతే క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ!!

కరాచీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్‌లో 7000 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. పాకిస్థాన్ దేశీయ టోర్నమెంట్ నేషనల్ టీ20ల్లో బాబర్ ఈ రికార్డు నెలకొల్పాడు. సెంట్రల్ పంజాబ్ తరపున ఆడుతూ.. దక్షిణ పంజాబ్‌పై 49 బంతుల్లో 59 పరుగులు చేయడం ద్వారా 7000 పరుగుల మార్క్ అందుకున్నాడు. బాబర్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. బాబర్ తన ఇన్నింగ్స్‌లో 25 పరుగులతో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనుకకు నెట్టేశాడు. ఇటీవలి కాలంలో బాబర్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పరుగుల వరద పారిస్తూ రికార్డులు బద్దలుకొడుతున్నాడు.

అత్యంత వేగంగా 7000 పరుగులు
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ టీ20 ఫార్మాట్‌లో 187 ఇన్నింగ్స్‌లలో 7000 పరుగులు పూర్తి చేశాడు. దాంతో టీ20ల్లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. ఇదే 7 వేల పరుగులు చేయడానికి క్రిస్ గేల్ 192 ఇన్నింగ్స్ తీసుకుంటే.. అంతకంటే 5 ఇన్నింగ్స్ ముందుగానే బాబర్ ఈ మైల్‌స్టోన్ అందుకోవడం విశేషం. మరోవైపు విరాట్ కోహ్లీ 212 ఇన్నింగ్స్‌లో 7 వేల రన్స్ చేశాడు. బాబర్ 196 టీ20 మ్యాచ్‌లలో 187 ఇన్నింగ్స్‌లలో 6 సెంచరీలు, 59 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పాక్ కెప్టెన్ అత్యధిక స్కోరు 122 పరుగులు.

మూడు ఫార్మాట్లలో సెంచరీలు
బాబర్ అజమ్ పాకిస్థాన్ తరఫున 61 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 56 ఇన్నింగ్స్‌లలో బాబర్ 47 సగటుతో 2204 పరుగులు చేశాడు. తన అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, 20 అర్ధ సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కూడా బాబర్ రికార్డు నెలకొల్పాడు. మరోవైపు క్రిస్ గేల్ మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేశాడు. అయితే విరాట్ కోహ్లీ టీ20ల్లో ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అభిమానులు, మాజీలు.. బాబర్‌ను తరచూ విరాట్ కోహ్లీతో పోలుస్తుంటారు. అన్ని ఫార్మాట్లలోనూ విరాట్‌కు దీటుగా పరుగులు చేయడమే అందుకు కారణం. అయితే టీ20 క్రికెట్‌లో మాత్రం బాబర్ కాస్త ముందే ఉన్నాడు.

30 మంది ఆటగాళ్లు
ఇప్పటివరకు 30 మంది ఆటగాళ్లు టీ20ల్లో 7 వేలకు పైగా పరుగులు సాధించారు. ఇందులో ఐదుగురు 10 వేలకు పైగా పరుగులు సాధించారు. వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్ 14276 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్‌తో పాటు వెస్టిండీస్ కీరన్ పొలార్డ్, పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ఉన్నారు. కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే పాకిస్తాన్ నుంచి 7 వేలకు పైగా పరుగులు చేశారు. బాబర్, మాలిక్‌తో పాటు మహ్మద్ హఫీజ్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. హఫీజ్ 7314 పరుగులు చేశాడు. టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, సురేష్ రైనా, శిఖర్ ధావన్ ఈ లిస్టులో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
DC vs CSK Dream11: డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! తొలిస్థానంలో నిలిచేదెవరో! తుది జట్లు ఇవే!!