Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs CSK Dream11: డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! తొలిస్థానంలో నిలిచేదెవరో! తుది జట్లు ఇవే!!

DC vs CSK Dream11 Prediction: Captain, Vice-Captain Tips And Head to Head Records For Match 50

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా ఈరోజు (సోమవారం) పాయింట్ల పట్టికలోని తొలి రెండు జట్ల మధ్య పోరు జరగనుంది. దుబయ్‌ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకు 18 పాయింట్లు ఉన్నా.. మెరుగైన రన్ రేట్ కారణంగా చెన్నై అగ్రస్థానంలో ఉంది. దాంతో ఈ రోజు గెలిచిన జట్టు లీగ్ దశ ముగిసేసరికి టాప్-2లో నిలిచే అవకాశం ఉంది.

అందుకే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంనుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో కూడా ఈ మ్యాచ్‌ను చూడాలనుకునే ఫాన్స్ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.

రికార్డ్స్

రికార్డ్స్

ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడడం ఇది రెండోసారి. అంతకుముందు జరిగిన పోరులో ఢిల్లీ విజయం సాధించింది. ఇక దుబయ్ పిచ్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. మొదటి మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. రెండోసారి చెన్నై గెలిచింది. గత 5 మ్యాచ్‌లలో రిషబ్ పంత్ సేన 3-2 తేడాతో విజయం సాధించింది. అయితే ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం 24 మ్యాచులు జరిగాయి.

ఇందులో చెన్నై 15 సార్లు గెలిచింది. మరోవైపు ఢిల్లీ కేవలం 9 సార్లు మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. దుబాయ్ వికెట్‌పై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 160. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పులేదు. ఇక్కడ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ ఉండనుంది. దుబాయ్ మైదానం పెద్దది కాబట్టి భారీ స్కోర్ నమోదు కావడం అసాధ్యమే.

కాగితంపై కనిపించినట్లే

కాగితంపై కనిపించినట్లే

ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల బలాబాలాను పరిశీలిస్తే.. కాగితంపై కనిపించినట్లే మైదానంలోనూ ఆడుతున్నాయి. రెండు జట్లు ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ టోర్నమెంట్‌లో దూసుకోతున్నాయి. దాంతో ఈరోజు జరిగే పోటీ చాలా హోరాహోరీగా ఉండబోతుంది. IPL 2021లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా చెన్నైనిలిచింది.

ఇప్పటివరకు మొత్తం 96 సిక్సర్లు చెన్నై బ్యాటర్లు బాదారు. ఇందులో రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే 20 సిక్సర్లు కొట్టాడు. అంతేకాదు గైక్వాడ్ ఐపీఎల్ 2021లో ఫోర్లు కొట్టడంలో కూడా ముందున్నాడు. ఇప్పటివరకు అతడు 43 ఫోర్లు బాదేశాడు. రెండు హేమాహేమీ జట్ల మధ్య పోరు ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 తేలిపోతున్న ఢిల్లీ బ్యాటర్లు

తేలిపోతున్న ఢిల్లీ బ్యాటర్లు

ఈ సీజన్​లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీకి కోల్​కతా నైట్ రైడర్స్ షాకిచ్చింది. కేకేఆర్​తో జరిగిన మ్యాచ్​లో ఢిల్లీ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆపై ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచులో కూడా తేలిపోయారు. అయితే లక్ష్యం చిన్నదే కావడంతో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకోవడంలో గట్టెక్కింది.

ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా బ్యాట్ జులిపించాల్సి ఉంది. భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. స్టీవ్ స్మిత్ కూడా పరుగులు బాకీ ఉన్నాడు. పంత్, అయ్యర్ ఫేమ్ కొనసాగిస్తే.. ఢిల్లీ భారీ స్కోర్ చేయొచ్చు. షిమ్రాన్ హెట్మెయర్ ఇప్పటివరకు సత్తాచాటలేదు. ఢిల్లీ బౌలింగ్ మాత్రం బాగుంది. అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జ్, అవేశ్ ఖాన్ వికెట్లు తీస్తున్నారు.

ఫామ్​లో చెన్నై

ఫామ్​లో చెన్నై

ఐపీఎల్​ 2021 రెండో దశలో చెన్నై సూపర్ కింగ్స్ దూసుకుపోతోంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ ఫామ్​లో ఉండటం చెన్నైకి కలిసొస్తోంది. మొదట బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా వీరు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. వీరికి తోడు మొయిన్ అలీ, అంబటి రాయుడు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా అలీ వేగంగా ఆడుతూ విలువైన పరుగులు చేస్తున్నాడు.

అయితే సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ ఫామ్ జట్టును కలవరపెడుతోంది. ఈ ఇద్దరు గాడిలో పడితే.. బ్యాటింగ్ విభాగంలో చెన్నైకి ఎదురులేదు. స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఒంటిచేత్తో మ్యాచులు మలుపు తిప్పుతున్నాడు. ఒకే ఓవర్లో మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తున్నాడు. అంతేకాదు బంతితో కూడా రాణిస్తున్నాడు. మరో ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో ఉండనే ఉన్నాడు. బౌలర్లు శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హాజెల్‌వుడ్ తమ బాధ్యత నిర్వర్తిస్తూ విజయాల్లో భాగమవుతున్నారు. అయితే ఇరు జట్లు ఎలాగూ ప్లే ఆఫ్ వెళ్లాయి కాబట్టి కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కూడా ఉంది.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జ్, అవేశ్ ఖాన్.

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జోష్ హాజెల్‌వుడ్, సామ్ కరన్/డ్వేన్ బ్రావో, దీపక్ చహర్.

 డ్రీమ్ 11 టీమ్

డ్రీమ్ 11 టీమ్

శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), స్టీవ్ స్మిత్, ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఆర్ అశ్విన్, జోష్ హాజెల్‌వుడ్, శార్దూల్ ఠాకూర్, అన్రిచ్ నోర్జ్.

Story first published: Tuesday, October 5, 2021, 16:04 [IST]
Other articles published on Oct 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+