For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓరి ఆజాము.. బ్యాటింగ్ పిచ్‌లపైనేనారా నీ ప్రతాపం?

కొలంబో: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ బాబర్ ఆజామ్(39) విఫలమయ్యాడు. 75 బంతులాడిన బాబర్ ఆజామ్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఓవరాల్‌గా అతని బౌలింగ్‌లో ఆరోసారి ఔటయ్యాడు.

జయసూర్య బౌలింగ్ ఆడేందుకు తెగ ఇబ్బంది పడుతున్న బాబర్ ఆజామ్ మొత్తం 7 ఇన్నింగ్స్‌ల్లో 6 సార్లు ఔటయ్యాడు. అతని బౌలింగ్‌లో 28.7 యావరే‌జ్‌తో 172 పరుగులు మాత్రమే చేసాడు. దాంతో బాబర్ ఆజామ్‌ను అత్యధికసార్లు ఔట్ చేసిన బౌలర్ల జాబితాలో జయసూర్య.. జోష్ హజెల్‌వుడ్‌తో సమంగా నిలిచాడు.

Babar Azam

హజెల్ వుడ్ 133 బంతుల్లో బాబర్ ఆజామ్‌ను ఆరుసార్లు ఔట్ చేయగా.. జయసూర్య 324 బంతుల్లో 6సార్లు ఔట్ చేశాడు. నాథన్ లియోన్ 443 బంతుల్లో ఐదు సార్లు బాబర్ ఆజామ్‌ను పెవిలియన్ చేర్చాడు. శ్రీలంక పర్యటనలో బాబర్ ఆజామ్ వరుసగా విఫలమవ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లాట్ వికెట్‌పైనే బాబర్ ఆజామ్ ఆడగలడని, బ్యాటింగ్‌కు సవాల్ విసిరే పిచ్‌లపై అతను దారుణంగా విఫలమవుతాడనే విషయం మరోసారి అర్థమైందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 'ఓరీ ఆజామ్.. ఫ్లాట్ వికెట్లపైనేనారా నీ ప్రతాపం'అని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. టర్నింగ్, పేస్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లపై బాబర్ ఆజామ్ ఆడలేడని, రోడ్డులాంటి ఫ్లాట్ వికెట్లపై మాత్రమే చెలరేగుతాడని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 178/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన పాకిస్థాన్ 94 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లకు 382 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్(281 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 182 బ్యాటింగ్) డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తుండగా.. సౌద్ షకీల్(57), షాన్ మసూద్(51) హాఫ్ సెంచరీలతో రాణించాడు.

అఘా సల్మాన్(21 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం పాక్ ఆధిక్యం 216 పరుగులకు చేరింది.

Story first published: Wednesday, July 26, 2023, 14:56 [IST]
Other articles published on Jul 26, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+