
దుబాయ్: బయో బబుల్ ఆటగాళ్ల మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని, టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పరాజయానికి ఇది కూడా ఓ కారణమంటూ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సమర్థించాడు. రవిశాస్త్రి చెప్పినట్లు బయో బబుల్‌తో బ్రాడ్‌మన్ కూడా ఆడలేడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌తో భారత హెడ్ కోచ్‌గా పదవి కాలం పూర్తిచేసుకున్న రవిశాస్త్రి టీమ్ వైఫల్యంపై మాట్లాడాడు. గత 6 నెలలుగా బయోబబుల్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు మానసికంగా అలసిపోయారని.. ఆటగాళ్లు కూడా మనుషులే అన్న విషయాన్ని క్రికెట్ బోర్డులు, అభిమానులు గుర్తించాలన్నాడు.పెట్రోల్ పోసి నడపడానికి టీమిండియా ఆటగాళ్లు ఏం యంత్రాలు కారని రవిశాస్త్రి పేర్కొన్నాడు. వరుస బయో బబుల్స్‌తో బ్రాడ్ మన్ కూడా ఆడలేడని పేర్కొన్నాడు.
బయోబబుల్ ఆటగాళ్లపై ప్రభావం చూపుతుందని రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తానని బాబర్ ఆజామ్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగే సెమీస్ పోరు నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన బాబర్ బయోబబుల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'రవిశాస్త్రి చెప్పినట్లు బయో బబుల్ ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతోంది. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఇలాంటి హెచ్చుతగ్గులు సాధారణమే అయినప్పటికీ.. ఎక్కువ కాలం బయో బుడగలో ఉండటం వల్ల ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు అసౌకర్యానికి గురవుతారు. ఒత్తిడిని అధిగమించేందుకు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలి.
తీరికలేని షెడ్యూల్ ఆటగాళ్లపై ప్రభావం చూపుతుందని క్రికెట్ బోర్డులు గ్రహించాలి. క్రికెటర్లకు విశ్రాంతి తీసుకోవడం కంటే గొప్ప పని మరొకటి ఉండదు. మా ఆటగాళ్లు సైతం గతేడాది కాలంగా నిరంతర బయో బబుల్ వాతావరణంలో ఉండడం వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోయాం. కానీ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం ద్వారా కాస్త ఉపశమనం పొందాం. 'అని బాబర్ చెప్పుకొచ్చాడు.
ఇక సెమీఫైనల్ పోరును ఉద్దేశిస్తూ.. జట్టుగా ఇప్పటి వరకు రాణించామని ముందు కూడా అదే జోరును కొనసాగిస్తామన్నాడు. 'ప్రతీ మ్యాచ్‌లో మేం అద్భుత ప్రదర్శన కనబర్చాం. సెమీఫైనల్లో కూడా అదే జోరు కొనసాగిస్తాం. ఇప్పటి వరకు సమష్టిగా శక్తిమేరా రాణించాం. టీ20 క్రికెట్‌లో ప్రతీ మ్యాచ్ సవాల్‌తో కూడుకున్నదే. జట్టులో ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా రాణిస్తున్నారు. ఎవరి పాత్ర ఏంటిదనే విషయంపై అందరికి ఓ క్లారిటీ ఉంది. అదే సానుకూలా దృక్పథంతో సెమీఫైనల్లో రాణిస్తాం. అయితే ఆ రోజు ఎవరు బాగా రాణిస్తే వారినే విజయం వరిస్తుంది.'అని బాబర్ పేర్కొన్నాడు.