IND vs UAE: వారెవ్వా బదోని వాటే క్యాచ్.. వావ్ అనాల్సిందే! (వీడియో)
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ విన్యాసాలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద రమణ్‌దీప్ సింగ్ సెన్సేషనల్ క్యాచ్ మరిచిపోకముందే.. తాజాగా ఆయుష్ బదోని కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. యూఏఈతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో స్టన్నింగ్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు.
ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు అవాక్కవుతున్నారు. క్యాచ్ ఆఫ్ ది టోర్నీ అంటూ ప్రశంసిస్తున్నారు. వారెవ్వా బదోనీ వాటే క్యాచ్ అంటూ కొనియాడుతున్నారు. ఈ క్యాచ్ ఎవరూ చూసినా వావ్ అనాల్సిందేనని కామెంట్ చేస్తున్నారు.

రమణ్‌దీప్ సింగ్ వేసిన 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని లెగ్ స్టంప్ లైన్‌లో వేయగా.. యూఏఈ బ్యాటర్ ముహమ్మద్ జావదుల్లా జరిగి లాంగాన్ సైడ్ భారీ షాట్ ఆడాడు. కానీ ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న ఆయుష్ బదోని పరుగెత్తుకుంటూ వచ్చి వెనక్కి సూపర్ డైవ్ చేశాడు. బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు కామెంటేటర్లు కూడా ఫిదా అయ్యారు. అద్భుతమైన క్యాచ్ అంటూ కొనియాడారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 16.5 ఓవర్లలో 107 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ చోప్రా(50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫమయ్యారు. భారత్-ఏ బౌలర్లలో రసిఖ్ సలామ్(3/16) మూడు వికెట్లు తీయగా.. రమణ్‌దీప్ సింగ్(2/7) రెండు వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్ శర్మ, నెహాల్ వధేరా తలో వికెట్ తీసారు.
WHAT A CATCH BY AYUSH BADONI 🥶🔥 pic.twitter.com/dt7PRcberN
— Johns. (@CricCrazyJohns) October 21, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications