Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ayush Badoni విరాట్ కోహ్లీ డై హార్డ్ ఫ్యాన్ ... సిక్స్‌తో మ్యాచ్ ఫినిష్.. అచ్చం అతనిలానే సంబరాలు! (వీడియో)

Ayush Badoni copies Virat Kohli’s celebration style after winning six against DC

ముంబై: ఐపీఎల్ 2022 సెన్సేషన్, లక్నో సూపర్ జెయింట్స్ యువ కెరటం ఆయుష్ బదోని మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ఈ ఢిల్లీ కుర్రాడు.. అదే జోరును కొనసాగిస్తున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఫినిషర్ రోల్‌లో మెరిసాడు. లక్నో టీమ్ విజయానికి చివరి 6 బంతుల్లో 5 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన శార్ధూల్ ఠాకూర్ తొలి బంతికే దీపక్ హుడాను ఔట్ చేసాడు. దాంతో.. క్రీజులోకి వచ్చిన ఆయుష్ బదోని.. రెండో బంతికి పరుగులు రాబట్టలేకపోయాడు.

లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టి..

దెబ్బకి గెలుపు సమీకరణం 4 బంతుల్లో 5 పరుగులుగా మారిపోయింది. కానీ.. మూడో బంతికి చూడ చక్కని కవర్‌‌డ్రైవ్ ఆడిన బదోని.. మిడాఫ్, ఎక్స్‌ట్రా కవర్ ఫీల్డర్ల మధ్యలో నుంచి బంతిని బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత బంతికే సిక్స్ బాది మ్యాచ్‌ని ఫినిష్ చేసేశాడు. విజయ లాంఛనం పూర్తి చేసిన తర్వాత బదోనీ.. టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్‌ను అనుకరించాడు.

విరాట్ డైహార్డ్ ఫ్యాన్..

విరాట్ డైహార్డ్ ఫ్యాన్..

ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఫినిషింగ్ సిక్స్ కొట్టగానే.. తన జెర్సీపై ఉన్న నెంబర్‌ను ఓ మూడు సార్లు కుడి చేతితో కొడుతూ అందరికీ చూపించిన బదోని.. అనంతరం గట్టిగా అరుస్తూ ఒకసారి గాల్లోకి పంచ్ విసిరాడు. విరాట్ కోహ్లీ కూడా కెరీర్ ఆరంభంలో సరిగ్గా ఇలానే గెలుపు సంబరాలు చేసుకునేవాడు. దాంతో.. ఈ ఇద్దరి సెలెబ్రేషన్స్ వీడియోలను కలగలిపి అభిమానులు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్త వైరల్‌గా మారింది. చూస్తుంటే బదోని విరాట్ కోహ్లీ డై హార్డ్ ఫ్యాన్ ఉన్నట్టున్నాడు కదా? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

బదోని నయా ఫినిషర్..

బదోని నయా ఫినిషర్..

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పృథ్వీ షా (34 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. క్వింటన్‌ డికాక్‌ (52 బంతుల్లో 80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో నాలుగో మ్యాచ్ ఆడిన లక్నో టీమ్‌కి ఇది వరుసగా మూడో గెలుపుకాగా.. ఇందులో రెండు మ్యాచ్‌ల్ని బదోనీనే బౌండరీతో ఫినిష్ చేయడం గమనార్హం. మిగిలిన రెండింటిలోనూ అతను ఫినిషర్ పాత్రని చక్కగా పోషించాడు.

బదోనీ కౌన్ హే రే..?

బదోనీ కౌన్ హే రే..?

ఢిల్లీకి చెందిన ఆయుష్ బదోనీని.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 20 లక్షల కనీస ధరకు తీసుకుంది. అండర్ 19 క్రికెట్‌లో ఆడిన ఈ 22 ఏళ్ల ఆటగాడు.. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఒక్కసారిగా ఐపీఎల్ 2022 తన ఆరంభ మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. ఈ ఆణిముత్యాన్ని లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ వెతికి తీసుకొచ్చాడు. లక్నో వేదికగా ఏర్పడబోతున్న జట్టు కోసం గౌతం గంభీర్.. ఢిల్లీ‌తో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులైన ఆటగాళ్ల కోసం అన్వేషణ సాగించాడు. ఈ క్రమంలో అతనికి బదోనీ దొరికాడు. అతని ప్రతిభను గుర్తించిన గంభీర్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే అతనికి అవకాశం ఇవ్వడంతో పాటు కృనాల్ పాండ్యా కన్నా ముందే బ్యాటింగ్‌కు పంపించాడు.

Story first published: Friday, April 8, 2022, 17:32 [IST]
Other articles published on Apr 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+