మోడల్‌తో ప్రేమాయణం..
రెండు రోజుల క్రితమే షోయబ్ మాలిక్ మోసం చేయడంతోనే సానియా మీర్జా ఈ కఠిన నిర్ణయం తీసుకుందనే ప్రచారం వ్యాప్తిలోకి వచ్చింది. ఓ మోడల్‌తో షోయబ్ మాలిక్ పెట్టుకున్న వివాహేతర సంబంధమే సానియా మీర్జా కాపురంలో నిప్పులు పోసాయని ప్రచారం జరిగింది. కొన్నాళ్ల క్రితం షోయబ్ మాలిక్‌కు సదరు మోడల్‌తో పరిచయమైందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆమెతో చనువుగా దారి తీసిందని, ఆ మోడల్ మోజులో పడిన షోయబ్ మాలిక్.. సానియాను పట్టించుకోవడం మానేసాడని వార్తలు షికారు చేశాయి.
సానియా సవతి ఫొటోలు వైరల్..
తాజాగా ఆ మోడల్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సానియా మీర్జా సవతి ఈమె అంటూ ఫ్యాన్స్ ఆ మోడల్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే.. పాక్ మోడల్ ఆయేషా ఒమర్. స్థానిక మ్యాగజైన్ కోసం షోయబ్ మాలిక్‌తో కలిసి ఆమె గతేడాది ఓ బోల్డ్ ఫొటోషూట్‌లో పాల్గొంది. హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌పై అవగాహనలో భాగంగా ఈ ఫొటో షూట్‌ను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయేషా తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. స్విమ్మింగ్‌పూల్‌లో అసభ్యకరంగా ఫోజులివ్వడం ప్రొఫెషనలిజమా? అని ప్రశ్నించాడు.
బోల్డ్ ఫొటోషూట్..
ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో షోయబ్ మాలిక్‌ను ప్రశ్నించగా.. అతను అతి తెలివి ప్రదర్శించాడు. ఈ ఫొటో షూట్ గురించి సానియా మీర్జా ఎలా స్పందించారని హోస్ట్ ప్రశ్నించగా.. 'మీ భర్త కూడా ఇలాంటి ఫొటోషూట్‌లో పాల్గొంటే మీ రియాక్షన్ ఏమిటి?'అని ఎదురు ప్రశ్నించాడు. సదరు హోస్ట్ వెంటనే తనకు పెళ్లి కాలేదని చెప్పగా.. సానియా కూడా రియాక్టవ్వలేదని తప్పించుకున్నాడు. అయితే ఫొటో షూట్ నుంచే సానియా-మాలిక్‌ల మధ్య విభేధాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. సానియాకూ దూరమైన మాలిక్.. ఆయేషాకు దగ్గరయ్యాడని, దాంతో ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే ఈ ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు.
బంగారం లాంటి పెళ్లాం..
ఇక మాలిక్ ఎఫైర్ పెట్టుకున్న మోడల్ ఆయేషా ఒమరేనా? అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. బోల్డ్ ఫొటో షూట్ తీయడంతో ఆమెనే అయి ఉంటుందని, పాక్ ఫ్యాన్స్, మీడియా అంచనా వేస్తుంది. షోయబ్ మాలిక్, సానియా మీర్జా అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు ఈ విషయంపై స్పష్టత వచ్చేలా లేదు. ఇక అభిమానులు మాత్రం మాలిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు బంగారం లాంటి పెళ్లాన్నిస్తే.. మాలిక్ కొవ్వెక్కి ఇలా చేస్తున్నాడని మండిపడుతున్నారు. లేడీ ఫ్యాన్స్ అయితే మాలిక్ తన మగబుద్దిని పోనిచ్చుకోలేదని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












