టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా తనకు దావత్ ఇవ్వలేదని స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్‌ను రోహిత్ శర్మ మిస్ చేసిన విషయం తెలిసిందే. అక్షర్ పటేల్ వేసిన హ్యాట్రిక్ బాల్‌కు బంగ్లాదేశ్ బ్యాటర్ జకేర్ అలీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను రోహిత్ శర్మ స్లిప్‌లో నేలపాలు చేశాడు. దాంతో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ వికెట్ మిస్సైంది.
ఈ క్యాచ్‌ను మిస్ చేసినందుకు తీవ్ర అసహనానికి లోనైన రోహిత్.. నేలను గట్టిగా కొట్టాడు. ఆ వెంటనే అక్షర్ పటేల్‌కు క్షమాపణలు కూడా చెప్పాడు. మ్యాచ్ అనంతరం తన తప్పిదం కారణంగానే అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ మిస్సైందని, అతన్ని డిన్నర్‌కు తీసుకెళ్తానని కూడా రోహిత్ తెలిపాడు.

తాజాగా ఈ విషయంపై స్పందించిన అక్షర్ పటేల్.. రోహిత్ శర్మ ఇంకా తనను డిన్నర్‌కు తీసుకెళ్లలేదని తెలిపాడు. అయితే న్యూజిలాండ్‌తో చివరి లీగ్ మ్యాచ్‌కు ముందు సుదీర్ఘ విరామం ఉన్నందున ఈ మధ్యలో డిన్నర్‌కు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పాడు. 'చివరి లీగ్ మ్యాచ్‌కు ముందు మాకు ఆరు రోజుల బ్రేక్ లభించింది. అంతేకాకుండా మేం సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించాం. కాబట్టి డిన్నర్‌కు తీసుకెళ్లమని రోహిత్ శర్మను అడిగేందుకు ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. ఈ బ్రేక్‌లోనే నన్ను రోహిత్ డిన్నర్‌కు తీసుకెళ్లొచ్చు'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
బంగ్లాదేశ్‌తో పాటు పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మార్చి 2న(ఆదివారం) జరగనున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌పై గెలిచి గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్త్ దక్కించుకుంది. అయితే ఈ ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ ఫలితమే గ్రూప్-ఏ టాపర్ ఎవరో నిర్ణయిస్తుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Tanzid ☝️
— Star Sports (@StarSportsIndia) February 20, 2025
Mushfiqur☝️
Hattrick... Well, almost! 😮
📺📱 Start watching FREE on JioHotstar: https://t.co/dWSIZFgk0E#ChampionsTrophyOnJioStar 👉 #INDvBAN, LIVE NOW on Star Sports 1 & Star Sports 1 Hindi! pic.twitter.com/5mn6Eqivci