Ravindra Jadeja కారణంగానే అవకాశాలు రావడం లేదు: అక్షర్ పటేల్

ముంబై: రవీంద్ర జడేజా అత్యుత్తమ ప్రదర్శనల వల్లే జట్టులో చోటు దక్కడం లేదని టీమిండియా యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. నైపుణ్యాల పరంగా తాను ఏమాత్రం వెనుకబడలేదని స్పష్టం చేశాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ అత్యంత సన్నిహితుడని తెలిపిన అక్షర్.. ఆట డల్‌గా సాగుతుంటే జోకులు పేల్చి నవ్విస్తుంటాడని చెప్పుకొచ్చాడు. ఆరేళ్ల క్రితమే అక్షర్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కానీ అతనికి వరుసగా అవకాశాలు దక్కలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో జడేజా గాయపడటంతో ఇటీవల భారత్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చోటు దక్కించుకున్న అతను దుమ్మురేపాడు. 3 టెస్టుల్లో 27 వికెట్లు తీసి సత్తా చాటాడు.

జడేజా వల్లే..
ఈ ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఈ పర్యటన కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్న అక్షర్ పటేల్ తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నైపుణ్యాల పరంగా వెనుకబడలేదు. దురదృష్టవశాత్తు గాయపడటంతో వన్డేల్లో చోటు కోల్పోయాను. ఇక టెస్టుల్లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా ఆడుతున్నారు. జడ్డూ అత్యుత్తమ ఆటతీరుతో మరో ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌కు చోటు దొరకడం కష్టం. మణికట్టు స్పిన్నర్లు కుల్‌దీప్, చాహల్ రాణిస్తున్నారు. జట్టు కూర్పు వల్లే నాకు చోటు దొరకలేదు. మళ్లీ అవకాశం దొరకగానే నన్ను నేను నిరూపించుకున్నా' అని అక్షర్ తెలిపాడు.

పంత్‌తో జోష్..
యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన సన్నిహితుల్లో ఒకడన్న అక్షర్.. జట్టు వాతావరణాన్ని సరదాగా మార్చడంలో, జోకులు పేల్చడంలో అతడికి తిరుగులేదని పేర్కొన్నాడు. 'రిషభ్ పంత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో మా ఇద్దరిదీ ఒకే జట్టు. పంత్ నాకు సన్నిహితుడు. జట్టు వాతావరణంలో అతను జోష్ నింపుతాడు. వికెట్ల వెనకాల ఉండీ అతను జోకులు పేల్చగలడు. కొన్నిసార్లు టెస్టుల్లో ప్రత్యర్థి భాగస్వామ్యాలు విడదీయడం కష్టమవుతుంది. ఆటగాళ్లు నిరుత్సాహ పడకుండా వారిలో ఉత్సాహం నింపే బాధ్యతను అతను తీసుకుంటాడు. అంతేకాకుండా వ్యాఖ్యలు చేస్తుంటాడు. అతడికవి సరిపోతాయి' అని అక్షర్ చెప్పుకొచ్చాడు.

అదే కారణం..
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రాణించడానికి బ్యాట్స్‌మెన్‌కు తన బౌలింగ్ అర్థం కాకపోవడమే కారణమని అక్షర్ చెప్పుకొచ్చాడు. 'నేను వేసే బంతి స్పిన్ అవుతుందా? లేదా అనే సందిగ్ధంలో ఉంటే బ్యాట్స్‌మన్ స్వీప్స్ లేదా రివర్స్ స్వీప్స్ ఆడేందుకు ప్రయత్నిస్తారు. వికెట్ టు వికెట్ బాల్ వేస్తే వారికి కఠినంగా ఉంటుంది. అదే బాల్ ఆఫ్ స్టంప్ లేదా లెగ్ స్టంప్‌కు పిచ్ అయితే స్వీప్ షాట్ ఆడుతారు. అయితే నా చేతిలో నుంచి వచ్చే బంతిని వారు అర్థం చేసుకోలేరు. బంతి ఎక్కడ పిచ్ అవుతుందో కూడా అంచనా వేయలేరు. దాంతో వికెట్లు ఇచ్చుకుంటారు.

వేగంగా స్పిన్ చేయగలను..
'నేను దేని గురించి ఎక్కువగా ఆలోచించను. అన్ని రకాల పరిస్థితుల్లో ఆడగలను. అయితే అది నా నిలకడపై ఆధారపడి ఉంటుంది. ఇతరుల కంటే నా బౌలింగ్ విభిన్నంగా ఉంటుంది. నేను పేస్‌ను కలిసి క్వికర్ బాల్స్ వేస్తాను. వాటికి స్పిన్ కూడా జత చేయగలను. ఆ విధంగానే బాగా ప్రాక్టీస్ చేస్తా. నేనెప్పుడైన కుంబ్లే, అశ్విన్ వంటి సీనియర్ స్పిన్నర్లను కలిసినప్పుడు ఇంకా ఏం చేయవచ్చనే విషయాన్ని అడుగుతాను. వారి సూచనలతో నా బౌలింగ్‌ను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తా'అని అక్షర్ చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీసేన న్యూజిలాండ్‌తో జూన్ 18-22 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లీష్ జట్టుతో ఆగస్టు 4-సెప్టెంబరు 14వరకు టెస్టు సిరీస్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications