
సంచలన ప్రదర్శనతో..
2013-14 రంజీ ట్రోఫీలో 369 పరుగులతో పాటు 29 వికెట్లతో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన అక్షర్ పటేల్‌కు తొలిసారి టీమిండియా పిలుపు అందింది. గాయంతో రవీంద్ర జడేజా ఈ పర్యట నుంచి అర్థంతరంగా తప్పుకోవడంతో అక్షర్‌కు అవకాశం దక్కింది. దాంతో అతను చివరి టెస్ట్‌కు ముందు భారత జట్టుతో కలిసాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న అక్షర్ పటేల్ తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్‌కు చెందిన యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్ పేరిట జరిగే ఈ షోలో అక్షర్ పటేల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ధోనీ రిటైర్మెంట్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో నెలకొన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు.

రవి సర్ ఆ మాట చెప్పగానే..
'2014 ఆస్ట్రేలియా పర్యటనలో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ జరుగుతుండగా.. రవి శాస్త్రి అత్యవసరంగా ఆటగాళ్లంతా సమావేశం కావాలని చెప్పాడు. టెస్ట్ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు పలికాడని తెలియజేశాడు. ఆ మాటతో ఆటగాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. సురేశ్ రైనా భయ్య అయితే వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇతర ఆటగాళ్లు సైతం భావోద్వేగానికి గురయ్యారు. ఆ సందర్భంగా ధోనీ భాయ్‌తో ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు.
కానీ నేను చెప్పే ముందే.. ధోనీ భాయ్ నువ్వు వస్తూనే నన్ను వెళ్లగొడుతున్నావ్? కదా అని అన్నాడు.

ఆ విషయంలో ధోనీకి సాటి లేరు..
ఆ మాటతో నాకు చాలా బాధేసింది. కన్నీళ్లు ఆగలేదు. నేను రాగానే అతను వెళ్తున్నాడా? అని బాధపడ్డా. అయితే తాను సరదాగా అన్నానని, ధోనీ భాయ్ నన్ను సముదాయించి హగ్ చేసుకున్నాడు. ఓ ప్లేయర్‌ను ఎలా వాడుకోవాలో? అతని నుంచి ఉత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో ధోనీ భాయ్‌కి బాగా తెలుసు. ఆ ఆటగాడి కంటే ధోనీకే అతని గురించి ఎక్కువగా తెలుసు'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు. ఆ పర్యటనలో అక్షర్ పటేల్‌కు అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. ఏడేళ్ల తర్వాత గతేడాది ఇంగ్లండ్‌తో టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేశాడు.

నానమ్మ వల్లే క్రికెటర్‌గా..
తన నానమ్మ కోరికను తీర్చేందుకే ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారనని అక్షర్ పటేల్ అన్నాడు. తాను జూనియర్ లెవల్ క్రికెట్ ఆడే సమయంలో టీవీలో ఎప్పుడు కనబడుతావు? అని తన నాన్నమ్మ తరుచూ ప్రశ్నించేదన్నాడు. అండర్ 16 టోర్నీ కోసం వెళ్లినప్పుడు.. తన నానమ్మ మరణించిందని, ఆమె అంత్యక్రియలకు హాజరు కాలేకపోయానని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రి.. కౌగలించుకొని భావోద్వేగానికి గురయ్యాడని గుర్తు చేసుకున్నాడు. తన తల్లి చివరి కోరికను నేరవేర్చాలని తనని కోరినట్లు చెప్పుకొచ్చాడు. ఆ క్షణమే కెరీర్‌ను సీరియస్‌గా తీసుకున్నానని చెప్పాడు.


Click it and Unblock the Notifications












