Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది నా అదృష్టం.. అతని వల్లే ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన: అక్షర్ పటేల్

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేయడంపై టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సంతోషం వ్యక్తం చేశాడు. టీ20 సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత వన్డే సిరీస్‌లో శుభారంభం చేయడం ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ విజయంలో తాను కీలక పాత్ర పోషించడం మరింత సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు. నాలుగు వికెట్లు దక్కడం తన అదృష్టమని తెలిపాడు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. అక్షర్ పటేల్(4/62, 57*) ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ అవార్డ్ స్వీకరించిన అనంతరం మాట్లాడిన అక్షర్ పటేల్.. వాషింగ్టన్ సుందర్ సాయంతోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పాడు.

Axar Patel Credits Washington Sundar for Match-Winning Partnership in India s 1st ODI Victory Over England

నా ప్లాన్‌ను అమలు చేశా..

'టీ20 సిరీస్ సాగిన విధానాన్ని బట్టి చూస్తే.. ఇది మాకు గొప్ప ఆరంభం. ముఖ్యంగా నా ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చింది. నా బౌలింగ్ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేశాను. స్టంప్ టు స్టంప్ లైన్‌లో నిర్దిష్టమైన ప్రాంతంలో బౌలింగ్ చేశాను. నాలుగు వికెట్లు దక్కడం నా అదృష్టం.

లక్ష్య ఛేదనలో మాకు మంచి ఆరంభం లభించింది. ఆటలో మెరుగైన స్థితిలో ఉన్నామని భావించి బ్యాటింగ్ చేశాం. కేవలం స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. విజయలాంఛనాన్ని పూర్తి చేయాలనుకున్నాం. నేను బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి కీలక భాగస్వామ్యం అవసరమైంది.

ఒక్కటే అనుకున్నాం..

వరుసగా వికెట్లు కోల్పోవడంతో వాషింగ్టన్ సుందర్‌‌తో కలిసి ఆచితూచి ఆడాను. నాలుగు-ఐదు ఓవర్ల తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే అప్పటికే మ్యాచ్ మా చేతుల్లో ఉంది. అందుకే కేవలం భాగస్వామ్యాన్ని నిర్మిస్తూ.. జట్టును గెలిపించాలనుకున్నాం. సుందర్ కూడా బాగా సహకరించాడు.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.


అక్షర్ ఆల్‌రౌండ్ షో..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జోరూట్(76 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 76 నాటౌట్), లియామ్ డాసన్(83 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 68) హాఫ్ సెంచరీలతో రాణించగా.. బెన్ డకెట్(45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్‌ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లకు 262 పరుగులు చేసి 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. శుభ్‌మన్ గిల్‌(75 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 80 రిటైర్డ్ హర్ట్), అక్షర్ పటేల్‌(52 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 57 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. శ్రేయస్ అయ్యర్(35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, సామ్ కరణ్ తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, July 15, 2026, 9:54 [IST]
Other articles published on Jul 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+