Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs DC: వారెవ్వా అవేశ్ ఖాన్.. వాటే యార్కర్.. బిత్తరపోయిన హార్దిక్ పాండ్యా! (వీడియో)

Avesh Khan bowls a superb yorker to peg back Hardik Pandya’s leg stump

షార్జా: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ అవేశ్ ఖాన్(3/15) దుమ్మురేపాడు. అద్భుత బౌలింగ్‌తో ముంబై బ్యాట్స్‌మన్‌ను వణికించాడు. మూడు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో అతను వేసిన ఓ యార్కర్‌కు ముంబై స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అవేశ్ వేసిన ఆ కచ్చితమైన యార్కర్‌కు హార్దిక్ తడబడగా.. కాళ్ల సందులో నుంచి దూసుకెళ్లిన బంతి లెగ్ స్టంప్‌ను ఎగరగొట్టేసింది. ఈ సూపర్ యార్కర్‌‌కు హార్దిక్ బిత్తరపోయాడు. ఏం అర్థంకానట్లు నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..

అవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఫస్ట్ బాల్‌కు హార్దిక్ ఔటయ్యాడు. అప్పటికే రెండు బౌండరీలు బాది మంచి జోరు మీదున్న హార్దిక్.. ముంబైకి మంచి ఫినిషింగ్ ఇస్తాడని అంతా భావించారు. కానీ చాలా తెలివిగా బౌలింగ్ చేసిన అవేశ్.. హార్దిక్‌ను పెవిలియన్ చేర్చి భారీ స్కోర్‌కు కట్టడి వేశాడు. అయితే అవేశ్ వైడ్ యార్కర్ వేస్తాడని భావించిన హార్దిక్ ముందే జరిగి కవర్స్ వైపు ఆడుదామని సిద్దమయ్యాడు. కానీ అవేశ్ పేసీ యార్కర్‌తో అతని కాళ్లకు విసిరాడు. ఈ బంతిని పసిగట్టలేకపోయిన హార్దిక్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్ నాలుగో బంతికి కౌల్టర్ నైల్‌ను ఔట్ చేసిన అవేశ్ ఖాన్.. తన ఫస్ట్ ఓవర్‌లోనే రోహిత్ శర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి మూడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక అవేశ్ ఖాన్ వేసిన యార్కర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూపర్ యార్కర్ అంటూ కొనియాడుతున్నారు.

ముంబై 129/8

ముంబై 129/8

మ్యాచ్ విషయానికి వస్తే.. అవేశ్ ఖాన్(3/15)తో పాటు అక్షర్ పటేల్(3/21) కూడా మూడు వికెట్లతో చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ముంబై ఇండియన్స్ 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) మినహా అంతా విఫలమయ్యారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఢిల్లీ బౌలర్లు సమష్టిగా చెలరేగారు. దాంతో ముంబై ఇండియన్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్‌కు తోడుగా అన్రిచ్ నోర్జ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.

కష్టాల్లో ఢిల్లీ

కష్టాల్లో ఢిల్లీ

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. దురదృష్టవశాత్తు ఓపెనర్ శిఖర్ ధావన్(8) రనౌటవ్వగా.. పృథ్వీ షా(6) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ వెంటనే స్టీవ్ స్మిత్(9) పెవిలియన్ బాట పట్టడంతో ఢిల్లీ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి కెప్టెన్ రిషభ్ పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ బాల్‌కే సిక్స్ బాది పంత్ జోరు కనబర్చాడు. అయితే జయంత్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి 80 రన్స్ చేసింది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(14)తో పాటు హెట్‌మైర్(3) ఉన్నాడు.

Story first published: Saturday, October 2, 2021, 18:46 [IST]
Other articles published on Oct 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+