ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్స్ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్‌కు ఓ ఐపీఎల్ టీమ్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా జట్టును వదిలి తమ ఫ్రాంచైజీ తరఫున గ్లోబల్ టీ20 టోర్నీల్లో ఆడితే ఏడాదికి రూ. 58.2 కోట్ల చొప్పున ఇస్తామని తెలిపినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఆఫర్‌ను కమిన్స్, ట్రావిస్ హెడ్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా జట్టు తరఫున ఈ ఇద్దరు ఆటగాళ్లు ఏడాదికి రూ.8.74 కోట్ల చొప్పున వార్షిక వేతనం అందుకుంటున్నారు. ఈ వేతనానికి 7 రెట్లు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆఫర్ చేయడం గమనార్హం. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్స్‌లో భాగమైన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగే ఐఎల్‌టీ20, సౌతాఫ్రికా వేదికగా జరిగే SA20, ఇంగ్లండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ లీగ్స్‌లోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీలు భాగమయ్యాయి.

ఇక ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్..ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్యాట్ కమిన్స్ ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా ఆడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీనే ఈ ఇద్దరి ఆటగాళ్లకు భారీ ఆఫర్ ఇచ్చి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం ప్యాట్ కమిన్స్ వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ గాయం కారణంగానే అతను భారత్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికవ్వలేదు. గ్లేన్ మ్యాక్స్‌వెల్ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. మిచెల్ మార్ష్.. ఆసీస్ జట్టును నడిపించనున్నాడు. అక్టోబర్ 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
భారత్‌తో ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిఛెల్ మార్ష్ (కేప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.