ఈ దశాబ్దపు అత్యుత్తమ టిక్‌టాకర్‌గా డేవిడ్ వార్నర్!!

సిడ్నీ: తాజాగా మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ దశాబ్దపు జట్టు, వ్యక్తిగత పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్, ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ముగ్గురూ వన్డే, టెస్ట్, టీ20లలో ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ది డికేడ్‌గా ఎంపికయ్యారు. ఇక ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దశాబ్దపు వన్డే, టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. తాజాగా వార్నర్ మరొక అవార్డుకు ఎంపికయ్యాడు. అయితే ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించుకున్నాడు.

దశాబ్దపు మేల్ టిక్‌టాకర్:
తనను తాను ఐసీసీ దశాబ్దపు మేల్ టిక్‌టాకర్ అని డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం ప్రకటించాడు. ఇన్‌స్టాలో అతనికి 5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కరోనా వైరస్ మహమ్మారి లాక్డౌన్ నుంచి వార్నర్ తన భార్య కాండిస్, కుమార్తెలతో కలిసి ఎన్నో టిక్‌టాక్ వీడియోలను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ భాషలకి సంబంధించిన పాపులర్ సాంగ్స్, డైలాగ్స్‌కి పలు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ అలరించాడు. ఇక తెలుగు హిట్సాంగ్ 'బుట్ట బొమ్మ'కు తన సతీమణి క్యాండిస్‌తో కలిసి చిందేసి టిక్‌టాక్‌లో స్టార్ అయ్యాడు.

ఉమ్మడి విజేతలుగా:
తాజాగా ఇన్‌స్టాలో భారత లెగ్‌స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను ట్యాగ్ చేస్తూ.. 'మీ మద్దతుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. యుజ్వేంద్ర చహల్ మనం ఇద్దరం ఉమ్మడి విజేతలుగా నిలిచామని నేను అనుకుంటున్నా' అని వార్నర్ తన ఇన్‌స్టాలో పేర్కొన్నాడు. ఐసీసీ దశాబ్దపు మేల్ టిక్‌టాకర్ అవార్డుకు ఎంపికైనట్లు తన పేరుతో ఉన్న అవార్డు ఫొటోను షేర్ చేశాడు. తన పోస్ట్‌లో బుట్టబొమ్మ హ్యాష్‌ట్యాగ్ కూడా జోడించాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. వార్నర్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్న వార్నర్:
భారత్‌తో జరగనున్న చివరి రెండు టెస్టులకు బుధవారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్టును ప్రకటించింది. 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సీఏ ఎంపిక చేయగా.. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్ సీన్ అబాట్, యువ ఆటగాడు విల్ పకోస్కీలు మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు. డేవిడ్ వార్నర్ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, సిడ్నీ టెస్టులో బరిలోకి దిగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని ఆస్ట్రేలియా జట్టు సెలెక్టర్ ట్రెవర్ హోన్స్ తెలిపాడు. టాప్ ఆర్డర్లో కీలకమైన వార్నర్‌పైనే ఆసీస్ భారీగా ఆశలు పెట్టుకుంది. వార్నర్ మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
India vs Australia: దిగ్గజాల సరసన రహానే.. ఇది రెండోసారి!!