For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అన్నీ చూసుకునే ఒప్పందాలు చేసుకోండి.. ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం వార్నింగ్

Australian Cricketers Association Warns Players To Do Your Homework Before Signing Up For Overseas T20 Leagues

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా లీగ్‌ల్లో పాల్గొనే ముందు అన్ని అంశాలు చూసుకొని, మున్ముందు రాబోయే సమస్యలను అంచనా వేసి ఒప్పందాలపై సంతకాలు చేయాలని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఏసీఏ) తమ ఆటగాళ్లను హెచ్చరించింది. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా దేశంలోకి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఐపీఎల్‌లో ఆడుతున్న ఆసీస్‌ క్రికెటర్లంతా చిక్కుల్లో పడ్డారు.

నేరుగా స్వదేశం వెళ్లలేక ఇప్పుడు మాల్దీవుల మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనినే ఏసీఏ గుర్తు చేసింది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) వాయిదా పడిన సమయంలో కూడా లిన్, క్రిస్టియాన్, కటింగ్‌ కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు.

హోం వర్క్ చేయాలి..

హోం వర్క్ చేయాలి..

'భవిష్యత్తులో ఇలాంటి స్థితి రాకూడదని కోరుకుంటున్నా. అయితే ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు కాస్త హోంవర్క్‌ చేసుకుంటే మంచిది. కరోనా కారణంగా ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది. మన దేశంలో అయితే అంతా బాగుండి మీరంతా ఎంతో స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. సరిహద్దులు మూసేసి ప్రయా ణాలపై ఆంక్షలు పెడతారని ఆటగాళ్లూ ఊహించలేదు. అయితే ఇలాంటివి జరిగినప్పుడు ఆందోళన పెరగడం సహజం' అని ఏసీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టాడ్‌ గ్రీన్‌బర్గ్‌ అన్నారు.

మైక్‌ హస్సీ మినహా....

మైక్‌ హస్సీ మినహా....

కరోనా పాజిటివ్‌గా తేలిన చెన్నై బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ మినహా మిగతా ఆస్ట్రేలియన్లంతా మాల్దీవులకు చేరుకున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించిన ఆస్ట్రేలియా బోర్డు (సీఏ)... ప్రభుత్వ ఆంక్షల్లో సడలింపులు వచ్చేవరకు వారంతా మాల్దీవులలోనే ఉండి ఆస్ట్రేలియాకు బయల్దేరతారని చెప్పారు.

హస్సీ మాత్రం కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి బయల్దేరతాడు. హస్సీ, బౌలింగ్‌ కోచ్‌ బాలాజీలను ముందు జాగ్రత్తగా సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ నుంచి చెన్నైకి తరలించింది. ఇక్కడ తమకు అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉన్నాయని... అవసరమైతే చెన్నైలో చికిత్స అందించడం సులువవుతుందని సీఎస్‌కే వర్గాలు వెల్లడించాయి.

ఇంటికి చేరిన ఇతర ఆటగాళ్లు..

ఇంటికి చేరిన ఇతర ఆటగాళ్లు..

ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు చేరుకున్న తర్వాతే ధోనీ తన ఇంటికి బయల్దేరనున్నాడు. ఎలాంటి ఆంక్షలులేని ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌ ఆటగాళ్లు స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇంగ్లండ్‌ పర్యటనకు దూరమవుతున్న న్యూజిలాండ్‌ పేసర్‌ బౌల్ట్‌ కూడా స్వదేశం వెళ్లిపోగా... విలియమ్సన్, సాన్‌ట్నర్, జేమీసన్‌ మాత్రం భారత్‌లోనే ఉండి మే 11న ఇంగ్లండ్‌కు బయల్దేరతారు.

Story first published: Friday, May 7, 2021, 8:48 [IST]
Other articles published on May 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+