Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆస్ట్రేలియా క్రికెటర్‌కు ఎదురుదెబ్బ!

Australian Cricketer Jailed For Rape Suffers Another Setback

లండన్: నిద్రిస్తున్న మహిళపై అత్యాచారం జరిపిన కేసులో దోషిగా తేలి ఐదేళ్ల శిక్షను అనుభవిస్తున్న ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెటర్‌ అలెక్స్ హెప్‌బర్న్‌కు కోర్టులో చుక్కెదురైంది. తనపై విధించిన శిక్షను సవాల్ చేస్తూ ఇటీవల అతను దాఖలు చేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ లార్డ్ బర్నెట్ నేతృత్వంలోని ముగ్గురు సీనియర్ జడ్జ్‌ల ధర్మాసనం కొట్టిపారేసింది. కిందిస్థాయి కోర్టు విధించిన శిక్ష సరేందేనని సమర్ధించింది. దీంతో అలెక్స్ హెప్‌బర్న్‌కు ఉన్న చివరి అవకాశం కూడా కోల్పోయింది.

 అసలేం జరిగిందంటే?

అసలేం జరిగిందంటే?

2017లో అలెక్స్ హెప్‌బర్న్ ఇంగ్లండ్‌లోని వార్చెస్టెర్‌షేర్‌ కౌంటీ క్రికెట్ క్లబ్‌ తరపున ఆడుతున్నాడు. ఓ రోజు తన సహచర ఆటగాడు జో క్లార్క్‌ ఓ అమ్మాయిని తన గదికి తీసుకొచ్చాడు. అదే గదిలో వుంటున్న హెప్‌బర్న్, ఆమె నిద్రపోయిన తర్వాత రేప్ చేశాడు. ఓ వాట్సాప్ గ్రూప్ గేమ్ కోసమే... ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలి తరఫున కేసును వాదించిన లాయర్ మిరండా మూరే అప్పట్లో తెలిపారు.

60 మంది మహిళలతో సెక్స్

60 మంది మహిళలతో సెక్స్

ఆ వాట్సాప్ గ్రూప్ గేమ్ రూల్స్ ప్రకారం.. ఆ గ్రూప్‌లోని వ్యక్తులు ఎంతమంది అమ్మాయిలతో సెక్స్‌లో పాల్గొన్నారో ఆ వివరాల్నీ గ్రూప్‌లో పోస్ట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత.. ఎవరి సంఖ్య ఎక్కువగా ఉంటే.. వాళ్లనే ఈ గేమ్ విజేతలుగా ప్రకటిస్తారు. ఈ గేమ్‌లో గెలవడానికి హెప్‌బర్న్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని మూరే అన్నారు. వాట్సాప్ గ్రూప్‌కి సంబంధించిన వివరాలను కూడా అప్పట్లో కోర్టుకు సమర్పించారు. ఇక పోలీసుల విచారణలో ఈ గేమ్ కోసం అలెక్ మొత్తం 60 మంది మహిళలతో సెక్స్ చేసినట్లు తేలింది.

ఆ అమ్మాయి ఇష్టంతోనే..

ఆ అమ్మాయి ఇష్టంతోనే..

హెప్‌బర్న్ మాత్రం ఆ అమ్మాయి సంపూర్ణ అంగీకారంతోనే సెక్స్‌లో పాల్గొన్నానని తెలిపాడు. తాను మద్యం మత్తులో ఉంటే... ఆమే వచ్చి తన బెడ్‌పై పడుకొని తనను ముద్దు పెట్టుకుందని అన్నాడు. మరో వైపు తన కళ్లు మూసుకొని ఉండగా... తనను 20 నిమిషాలపాటూ రేప్ చేశాడనీ, తాను మొదట అది క్లార్క్ అనుకున్నాననీ, గొంతు విన్న తర్వాతే అది అలెక్స్ అని అర్థమైందని బాధితురాలు అప్పట్లో కోర్టులో తెలిపింది. తమను తప్పుదారి పట్టించాలని చూసిన హెప్ బర్న్‌పై కూడా కోర్టు మండిపడింది. అతన్ని దోషిగా తెల్చుతూ గతేడాది ఏప్రిల్‌లో వోర్సెస్టర్ క్రౌన్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

శిక్ష సరైందే..

శిక్ష సరైందే..

వోర్సెస్టర్ క్రౌన్ కోర్టు తనపై విధించిన శిక్షను సవాల్ చేస్తూ లండన్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన లార్డ్ బర్నెట్ నేతృత్వంలోని ముగ్గురు సీనియర్ జడ్జ్‌ల ధర్మాసనం కింది స్థాయి కోర్టు విధించిన శిక్ష సరేందేనని తెలిపింది. హెప్ బర్న్ చెబుతున్నట్లుగా వాట్సాప్ సందేశాల్లో లేదని, అనుమతి లేకుండానే అత్యాచారం చేసినట్లు అర్ధమవుతుందని తెలిపింది. ఇక అలెక్స్ తరఫు న్యాయవాది వాదనలను తోసిపుచ్చింది. గేమ్‌ల పేరిట మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించడం హేయమైన చర్యగా పేర్కొంది.

Story first published: Wednesday, July 1, 2020, 13:16 [IST]
Other articles published on Jul 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+