క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఒకే ఓవర్‌లో 8 సిక్స్‌లు..!

క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టడమే పెద్ద ఘనతగా భావిస్తుంటాం. ఇప్పటి వరకు యువ రాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, హెర్షెల్ గిబ్స్, జస్కరణ్ మల్‌హోత్రాలు అంతర్జాతీ క్రికెట్‌లో ఈ ఘనతను అందుకోగా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రవిశాస్త్రి, గార్‌ఫీల్డ్ సోబెర్స్, రాస్ విట్లే, హజ్రతుల్లా జజై, లియో కార్టర్, తిసారా పెరారా ఈ అరుదైన ఫీట్ సాధించారు. అయితే ఈ అందరి రికార్డులను వెనక్కినెట్టుతూ ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ సామ్ హారిసన్ ఏకంగా ఒకే ఓవర్‌లో 8 సిక్స్‌లు బాదాడు. బౌలర్ వేసిన రెండు నోబాల్స్‌ను సైతం సిక్స్‌గా మలిచిన అతను క్రికెట్ చరిత్రలో ఓ కొత్త రికార్డును నెలకొల్పాడు.
8 బంతుల్లో 8 సిక్స్‌లు..
పెర్త్ వేదికగా నార్త్ సబర్బన్ కమ్యూనిటీ క్రికెట్ అసోసియేషన్ సమక్షంలో జరిగిన గ్రేడ్ క్రికెట్‌లో సామ్ హారిసన్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోర్రెంటో డంక్రైగ్ సీనియర్ క్లబ్, కింగ్‌స్లే వుడ్‌వాలే సీనియర్ క్లబ్ మధ్య మ్యాచ్ జరగ్గా.. సోర్రెంటోకు ప్రాతినిథ్యం వహించిన సామ్ హారిసన్ పరుగుల విధ్వంసం సృష్టించాడు.
ప్రత్యర్థి బౌలర్ నాథన్ బెన్నెట్ వేసిన 39వ ఓవర్‌లో సామ్ హారిసన్ ఏకంగా 8 బంతుల్లో 8 సిక్సర్‌లు బాదాడు. ఈ ఓవర్‌లో నాథన్ బెన్నెట్ రెండు నో బాల్స్ వేయగా వాటిని కూడా సామ్ సిక్సర్లుగా మలిచాడు. దాంతో ఈ ఓవర్‌లో మొత్తం 50 పరుగులు వచ్చాయి.

బౌలర్‌గా చెత్త రికార్డు..
ఫలితంగా నాథన్ బెన్నెట్.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అయితే దీన్ని కన్నా చెత్త రికార్డు క్రికెట్‌లో ఉండటం గమనార్హం. న్యూజిలాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బెర్ట్ వెన్స్ అనే ఓ బౌలర్ ఏకంగా 77 పరుగులు సమర్పించుకున్నాడు. హయ్యెస్ట్ లెవల్ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఇక ఐపీఎల్‌లో క్రిస్ గేల్, రవీంద్ర జడేజాలు ఓకే ఓవర్‌లో 37 పరుగులు పిండుకున్నారు. ప్రశాంత్ పరమేశ్వరన్ బౌలింగ్‌లో గేల్.. ఈ ఏడాది హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా ఈ ఘనతను అందుకున్నారు.

122 పరుగులతో ఘన విజయం..
ఈ క్లబ్ మ్యాచ్‌లో సామ్ ఏకంగా 11 సిక్స్‌లు 6 ఫోర్లతో (102 నాటౌట్) అజేయ శతకం సాధించాడు. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన సోరెంటో డంక్రైగ్ క్లబ్ 40 ఓవర్లలో 276 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కింగ్‌స్లే వుడ్‌వాలే క్లబ్ నీర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. దాంతో డంక్రైగ్ క్లబ్ 122 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications