Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అబ్బాయిలే కాదు అమ్మాయిలు గెలిచారు.. ఆస్ట్రేలియాదే యాషెస్!

నాటింగ్‌హామ్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను బద్దలుకొట్టి ఆస్ట్రేలియా పురుషుల జట్టు శుభారంభం చేస్తే.. అమ్మాయిలు అసాధారణ ఆటతో ఏకంగా ఛాంపియన్‌గా నిలిచారు. ఇంగ్లండ్ మహిళల జట్టుతో సోమవారం ముగిసిన ఏకైక యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లో 89 పరుగులతో ఆసీస్ మహిళల టీమ్ గెలుపొందింది.

268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మహిళల టీమ్ 178 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ అష్లే గార్డెనర్(8/66) 8 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. కిమ్ గార్త్, తహిలా మెక్‌గ్రాత్ తలో వికెట్ తీసారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డానియల్ వ్యాట్(88 బంతుల్లో 5 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీ రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

Australia Women’s wins Ashes Test after they beat England by 89 runs on final day

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 124.2 ఓవర్లలో 473 పరుగులు చేసింది. అన్నబెల్ సదర్లాండ్(184 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 137) సెంచరీ బాదగా.. ఎల్లిస్ పెర్రీ(153 బంతుల్లో 15 ఫోర్లతో 99) తృటిలో శతకాన్ని చేజార్చుకుంది. తహిలా మెక్‌గ్రాత్(83 బంతుల్లో 8 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించింది.

ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లీస్టోన్ ఐదు వికెట్లు తీయగా.. లారెన్ బెల్, లారెన్ ఫిలర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ మహిళలు తొలి ఇన్నింగ్స్‌లో121.2 ఓవర్లలో 463 పరుగులు చేసింది. టమ్మీ బీమౌంట్(331 బంతుల్లో 27 ఫోర్లతో 208) డబుల్ సెంచరీ బాదగా.. నాట్ సివర్ బ్రంట్(111 బంతుల్లో 12 ఫోర్లతో 78), హీథర్ నైట్(91 బంతుల్లో 9 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఆసీస్ బౌలర్లలో అష్లీ గార్డ్‌నర్ నాలుగు వికెట్లు తీయగా.. తహిళా మెక్‌గ్రాత్ మూడు వికెట్లు పడగొట్టింది. 10 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆసీస్ 257 పరుగులకు కుప్పకూలింది. బెత్ మూనీ(168 బంతుల్లో 10 ఫోర్లు 85), అలీసా హీలీ(62 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఈ మ్యాచ్‌లో అష్లెగార్డనర్ 10 వికెట్ల ఘనతను అందుకోవడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన ఆమె.. రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసి మొత్తం 12 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అందుకుంది.

Story first published: Monday, June 26, 2023, 19:09 [IST]
Other articles published on Jun 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+