For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్కడే 8 క్యాచ్‌లు.. ఆస్ట్రేలియా క్రికెటర్ వరల్డ్ రికార్డ్!

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నీ మార్ష్ వన్డే కప్‌లో అలెక్స్ క్యారీ ఈ ఫీట్ సాధించాడు. ఈ టోర్నీలో సౌత్ ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగిన అలెక్స్ క్యారీ.. అడిలైడ్ వేదికగా క్వీన్స్‌లాండ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 8 క్యాచ్‌లు అందుకున్నాడు.

జోర్డాన్ బకింగ్‌హమ్ బౌలింగ్‌లో ఐదు క్యాచ్‌లు అందుకున్న అలెక్స్ క్యారీ.. మ్యాట్ కుహ్నేమన్ క్యాచ్‌తో 8 క్యాచ్‌లు పూర్తి చేసుకొని లిస్ట్ ఏ రికార్డును సమం చేశాడు. అలెక్స్ క్యారీ క్యాచ్‌లకు బెన్ మెక్‌డెర్మాట్, మ్యాట్ రేన్‌షా, మార్నస్ లబుషేన్, జే కల్లేటన్, జాక్ విల్డ్‌ముత్, డిలన్ మెక్‌లాచ్లాన్, గురిందర్ సంధు‌లు పెవిలియన్ చేరారు.

Australia Wicketkeeper Alex Carey Takes 8 Catches In An Innings

లిస్ట్ ఏ క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో 8 క్యాచ్‌లు అందుకోవడం మూడోసారి. 1982లో ఇంగ్లండ్ ప్లేయర్ డెరక్ టేలర్ సోమర్‌సెట్ తరఫున తొలిసారి ఈ ఫీట్ సాధించాడు. 2021లో జేమ్స్ పైప్ వార్క్‌స్టెషైర్ జట్టు తరఫున 8 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ ప్రాతినిథ్యం వహిస్తున్న సౌత్ ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన క్విన్స్ లాండ్ 218 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సౌత్ ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 5.5 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ 12 బంతుల్లో 10 పరుగులే చేశాడు.

అంతర్జాతీయ వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఒక ప్లేయర్ 6 క్యాచ్‌లు అందుకోవడమే రికార్డుగా ఉంది. ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఈ ఫీట్ సాధించాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్.. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 క్యాచ్‌లు అందుకున్నాడు.

ఈ ఇద్దరితో పాటు ఇంగ్లండ్ ప్లేయర్లు అలెక్ స్టెవర్డ్, మాట్ ప్రియర్, జోస్ బట్లర్‌తో పాటు సౌతాఫ్రికా ప్లేయర్ మార్క్ బౌచర్, స్కాట్లాండ్ మాథ్యూ క్రాస్, పాకిస్థాన్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ ఫీట్ సాధించారు.

Story first published: Wednesday, February 14, 2024, 19:18 [IST]
Other articles published on Feb 14, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+