తొలి టెస్టులో ఐదు రికార్డులు బ్రేక్ చేసేందుకు టీమిండియా..

న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో విజయం సాధించాలని టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. డిసెంబరు 6 ఆడిలైడ్ వేదికగా తొలి టెస్టు ఆరంభం అవుతున్న నేపథ్యంలో నెట్స్‌లో ఇరు జట్లు చాలా కష్టపడుతున్నాయి. ఈ టెస్టు సమరం కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడం గురించి పక్కన పెడితే వారి కెరీర్‌లో కీలక మైలురాళ్లను చేరుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సిరీస్ విజయం కోసం టీమిండియా:
ఇప్పటివరకూ ఆస్ట్రేలియా గడ్డపై 11 సిరీస్‌ల వరకూ ఆడింది. వాటిలో 8వరకూ ఆతిథ్య జట్టు గెలుపొందగా మూడు మాత్రం టైగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇదే అనువైన సమయంగా భావించిన టీమిండియా సీనియర్ క్రికెటర్లంతా.. భారత్ టెస్టు గెలిచేందుకు చక్కని అవకాశమని భావిస్తున్నారు. ఎందుకంటే ఆ జట్టు సుప్రీం బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు నిషేదం కారణంగా ఆసీస్ జట్టుకు దూరంగా ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన గౌతం గంభీర్

రెండు రికార్డుల వేటలో విరాట్ కోహ్లీ:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టెస్టులో రెండు మైలురాళ్లను అందుకోవడానికి అవకాశం ఉంది. ఆసీస్‌పై టెస్టుల్లో కోహ్లీ 1,000 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో ఎనిమిది పరుగులు చేస్తే అతడు ఈ ఘనతను సాధించగలడు. మరో రెండు సెంచరీలు బాదితే సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించగలడు. ఇదే కనుక జరిగితే ఆసీస్‌లో ఎక్కువ సెంచరీలు చేసిన టీమిండియా ఆటగాడిగా తొలిస్థానంలో నిలుస్తాడు.

200 అంతర్జాతీయ వికెట్ల కోసం భువనేశ్వర్ కుమార్:
ఫిట్‌నెస్ సమస్యతో కొన్ని రోజుల పాటు భువి జట్టులో స్థానం సంపాదించుకోలేదు. అతడు ఆసీస్‌తో మొదటి లేదా రెండో టెస్టుకు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ఈ సిరీస్‌లో మరో ఐదు వికెట్లు తీస్తే 200 అంతర్జాతీయ వికెట్లు అతడి ఖాతాలో పడతాయి.

పూజారా 95 చేస్తే 5000పరుగులు
టీమిండియా బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పుజారా కూడా కీలక మైలురాయి కోసం ఎదురు చూస్తున్నాడు. మరో 95 పరుగులు చేస్తే టెస్టుల్లో అతడి ఖాతాలో 5,000 పరుగులు చేరతాయి.

50వికెట్లకు ఒక్క వికెట్ ముందు రవీంద్ర జడేజా:
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈ సిరీస్‌లో మరో మైలురాయిని చేరనున్నాడు. ఆస్ట్రేలియాతో 50 వికెట్ల మైలురాయిని చేరడానికి ఇంకో ఒక్క వికెట్ తీస్తే చాలు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications