Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రేకింగ్ న్యూస్.. స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం!

Australia Spinner Shane Warne


సిడ్నీ:
క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండె పోటుతో మరణించాడు. ఈ విషయాన్ని అతని మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. థాయ్‌లాండ్‌లో ఉన్న 52 ఏళ్ల షేన్ వార్న్ అతని విల్లాలో అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించామని, వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని మేనేజ్‌మెంట్ తెలిపింది. తదుపరి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.

కాగా 1992 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా తరపున 145 టెస్టులు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు సాధించాడు. ఇందులో ఐదు వికెట్ల ఘనతను 37 సార్లు, 10 వికెట్ల ఘనతను 10 సార్లు అందుకున్నాడు. 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన షేన్ వార్న్.. 2007లో వీడ్కోలు పలికాడు. 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సేవలందించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. వార్న్ కంటే ముత్తయ్య మురళీ ధరన్(800) ముందున్నాడు. సచిన్-వార్న్, లారా-వార్న్ పోరాటం క్రికెట్ అభిమానులను ఎంతో అలరించింది.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన షేన్ వార్న్ అరంగేట్ర సీజన్‌లోనే కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ అందించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు మరో టైటిల్ గెలవలేదు. 2011 వరకు రాజస్థాన్‌కు కెప్టెన్‌గా కొనసాగిన వార్న్..ఆ తర్వాత మెంటార్‌గా కూడా సేవలందించాడు.

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కామెంటేటర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన షేన్ వార్న్.. క్రికెట్ మ్యాచ్‌లపై ఎప్పటికప్పుడూ తన అభిప్రాయాలను పంచుకుంటూ అభిమానులతో టచ్‌లోనే ఉన్నాడు. ఇటీవలే ఇంగ్లండ్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు కూడా వార్న్ సిద్దంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక షేన్ వార్న్ అకాల మరణంపై యావత్ క్రికెట్ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. అస్సలు ఈ వార్తను నమ్మలేకపోతున్నామని పలువురు దిగ్గజ ఆటగాళ్లు, అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

Story first published: Friday, March 4, 2022, 20:21 [IST]
Other articles published on Mar 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+