Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెమీస్‌‌కు ఆస్ట్రేలియా.. డేంజర్ జోన్‌లో టీమిండియా!

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. వరుస విజయాలతో ఓటమెరుగని జట్టుగా దుమ్మురేపుతున్న ఆసీస్.. మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే నాకౌట్ బెర్త్ దక్కించుకుంది. వైజాగ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఇది ఆసీస్‌కు నాలుగో విజయం.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు చేసింది. సోభాన మోస్ట్రే(66 నాటౌట్)అజేయ హాఫ్ సెంచరీ‌తో రాణించింది. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్, అలనా కింగ్, జార్జియో వేర్‌హామ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మేఘన స్కట్(1/11) ఒక వికెట్‌ తీసింది. అనంతరం ఆస్ట్రేలియా 24.5 ఓవర్లలో 202 పరుగులు చేసి 151 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది.

Australia Seals CWC25 Semi-Final Spot After Thumping Bangladesh India s Qualification Scenario Tightens

టాప్‌లో ఆసీస్..

ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ నాలుగు గెలవగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో 9 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తమ తదుపరి మ్యాచ్‌లను ఇంగ్లండ్, సౌతాఫ్రికాతో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ఆసీస్.. సెమీస్‌ బెర్త్‌కు డోకా లేదు. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఇంగ్లండ్, సౌతాఫ్రికా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతుండగా.. భారత్ రెండు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌ల్లో భారత్ రెండు గెలిచినా సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది. రెండు ఓడితే ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది.

టీమిండియాకు లక్కీ ఛాన్స్..

మూడు ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఆసీస్‌కు సెమీస్ బెర్త్ కావడంతో టీమిండియా డేంజర్ జోన్‌లో నిలిచింది. లీగ్ దశ ముగిసే సరికి టాప్-4‌లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఆసీస్ ఇప్పటికే సెమీస్ చేరడంతో మిగతా మూడు స్థానాల కోసం ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి.

న్యూజిలాండ్ చివరి మూడు మ్యాచ్‌లకు మూడు గెలిస్తేనే సెమీస్ బెర్త్ దక్కుతుంది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా మరో రెండు విజయాలు సాధిస్తే సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది. ముఖ్యంగా టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై గెలిస్తేనే సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది.

Story first published: Friday, October 17, 2025, 11:10 [IST]
Other articles published on Oct 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+