పూజారాను కాపీ కొడితేనే భారీ స్కోరు చేయగలం: ఆసీస్ బౌలర్


సిడ్నీ: నాలుగో టెస్టులో విజయానికి తొలి ఇన్నింగ్స్ అత్యంత కీలకమని ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషానె అన్నాడు. టీమిండియాలో మూడో స్థానంలో ఆడుతున్న ఛెతేశ్వర్ పుజారా టెక్నిక్‌ను, టైమింగ్‌ను అనుసరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఆసీస్ జట్టులో లబుషానె మూడో స్థానంలో ఆడనున్నాడు. ఇక పుజారా తొలి రోజు ఆట ముగిసే సరికి 130 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిరీస్‌లో మూడో సెంచరీని అందుకున్నాడు. భారత్ 303/4తో తొలి రోజు ఇన్నింగ్స్‌ను ముగించింది.

పూజారాను కాపీ కొట్టి తీరాల్సిందే
‘పుజారా చాలా క్లాస్. సహనంతో ఆడి.. క్రీజులో అతను ఎక్కువసేపు నిలదొక్కుకున్నాడు. పూజారా బ్యాటింగ్‌ను చూసి వ్యక్తిగతంగా మేమెంతో నేర్చుకోవాల్సి ఉంది. సిరీస్ ఆసాంతం అతడు ఎక్కువ సమయం బ్యాటింగ్ చేశాడు. ఆసీస్ జట్టు కూడా భారీ స్కోరు దిశగా కొనసాగాలంటే అతడిని కాపీ కొట్టి తీరాల్సిందే. మ్యాచ్‌లో నిలవాలంటే మాకు 3 వికెట్లు కావాలి. శుక్రవారం ఉదయం సరైన ప్రాంతాల్లో బంతులు వేయాలి. ప్రత్యర్థిని 400 లోపు ఆలౌట్ చేస్తామన్న నమ్మకం ఉంది' అని లుబషానె పేర్కొన్నాడు.
డబుల్ సెంచరీ ముంగిట పూజారా ఔట్, 500కు చేరువలో టీమిండియా

మెల్‌బౌర్న్ తరహాలో వేగం
‘3 రోజుల వరకు వికెట్ బాగుంటుంది. ఆపై వేగంగా క్షీణిస్తుంది. ఆ తర్వాత మెల్‌బౌర్న్ తరహాలో ఆట వేగం పుంజుకుంటుంది. అందుకే తొలి ఇన్నింగ్స్ అత్యంత కీలకం. మూడో టెస్టులోనే మూడో స్థానంలోకి రావడంతో కొంత ఒత్తిడి ఉంటుంది. అయితే నా పాత్ర ఏంటో తెలుసు. క్వీన్స్‌ల్యాండ్ తరఫున ఎక్కువగా మూడో స్థానంలోనే ఆడాను. అది అనుకూలంగానే అనిపించింది. ఎక్కువ సమయం క్రీజులో ఉండటమే నా కర్తవ్యం' అని లబుషానె అన్నాడు.
డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లిన పూజారా
శుక్రవారం 303/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 500 పరుగులకు చేరువలో ఉంది. డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లిన పూజారా 193 పరుగులు చేసి నాథన్ లయన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇన్నింగ్స్ 130వ ఓవర్లో నాథన్ వేసిన చివరి బంతిని ఆడిన పుజారా (193) అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications